Ys jagan : జగన్ ఎందుకు ఇలా భయపడుతున్నాడు… అసలు ఆయనకి ఏమైంది?
Ys jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి వచ్చిన జగన్.. అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి రావడంతో అందరు ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రూటు పూర్తిగా మార్చేశారు. ఇక అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా.. జగన్ మాత్రం లోపలికి వెళ్లలేదు. ఆయన సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్లారు.
Ys jagan జగన్‌లో భయానికి కారణం..
జగన్ సభలోకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో చివరి బెంచ్‌లో ఐదు నిమిషాల పాటూ కూర్చున్నారు. ఆయనతో పాటు పక్కనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వారి, వారి స్థానాల్లో కూర్చొన్నారు. ఇక జగన్ ప్రమాణం చేశాక.. అసెంబ్లీలో ఉండకుండా.. తన ఛాంబర్‌కి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అప్పుడు కూడా వెనక గేట్ నుంచే వెళ్లారు. ఇలా నిన్న జగన్.. అడుగడుగునా.. ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిలా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి ఆయన ఆ 40 శాతం మంది ప్రజలకు ప్రతినిధిగా సభలో ధైర్యంగా అడుగుపెట్టారు. అడుగడుగునా కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. ఐదేళ్ల తర్వాత తిరిగి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉండాలి.
అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని పథకాలను ఎలా అమలుచేస్తుందో చూస్తా అన్నట్లు గంభీరంగా ఉండాలి. తనకు ఓటు వేసి వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ ధైర్యంగా నిలబడాలి. అది మానేసి.. ఇలా తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా అసెంబ్లీ కూడా వెళ్లకూడదనే భావనలో ఉన్నారట. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి జగన్ ఇలాగే వ్యవహరిస్తున్నారనీ, తనకు ఓట్లు ఎందుకు వెయ్యలేదో అని ప్రజలను తప్పుపుడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఓట్లు వేసిన వారికి భరోసాగా ఉండాల్సిన జగన్.. అసెంబ్లీకి వెళ్లకూడదనుకునే తీరు.. సరైనది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.