YS Jagan : నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్…చీర కట్టుకొని ఇంటికి రా…పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్…చీర కట్టుకొని ఇంటికి రా…పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు…

YS Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా సరే జగన్ సీఎం కూర్చిని లాగేసుకోవాలని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మొదటి జాబితా విడుదల చేసిన కూటమి ఇప్పుడు పొత్తులో భాగంగా భారీ బహిరంగ సభలను కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ మరియు […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్...చీర కట్టుకొని ఇంటికి రా...పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...

  •  YS Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

  •  గన్ నీకు చెబుతున్న విను పవన్ కళ్యాణ్ అంటే నీ దృష్టిలో మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు కానీ పవన్ కళ్యాణ్ అంటే రేపటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ,

YS Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా సరే జగన్ సీఎం కూర్చిని లాగేసుకోవాలని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మొదటి జాబితా విడుదల చేసిన కూటమి ఇప్పుడు పొత్తులో భాగంగా భారీ బహిరంగ సభలను కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ మరియు జనసేన పొత్తులో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఇక ఈ భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రె రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్లు 2 విడాకులు..ఇక ఇప్పుడు నాలుగు పెళ్లిళ్లు నలుగురు పెళ్ళాలు అని కూడా సంబోధిస్తున్నాడు. నాకు తెలియని ఆ నాలుగు పెళ్లి ఏంటో ఆ నాలుగు పెళ్ళం ఎవరో…నాకు తెలియని నాలుగు పెళ్ళం అంటే అది నువ్వే అయి ఉంటావు జగన్ రా మరి అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా నా భార్యల గురించి చంద్రబాబు గారి సతీమణి గురించి జగన్ మోహన్ రెడ్డి చాలా అసభ్యకరంగా మాట్లాడతాడని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా వైయస్ భారతి మేడం మిమ్మల్ని మేము చాలా గౌరవంగా భారతి మేడం అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక ఆడపడుచుకు మేము ఇచ్చే గౌరవం అది. కానీ నీ భర్తకు మాత్రం అవేమి పట్టనట్టుగా పెళ్ళాలు అని సంబోధిస్తూ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. నీ భర్త అన్నట్లు గా నేను కూడా మిమ్మల్ని అని ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచన చేయండి అంటూ తేలియజేశారు. నాకు తెలుగులో బూతులు మాట్లాడడం వచ్చు అని నేను ఇంగ్లీష్ మీడియం చదువుకొని రాలేదని నేను కూడా తెలుగు మాట్లాడగలనని.. కానీ ఒక ఆడపడుచుకి ఇవ్వాల్సిన గౌరవం కొద్ది మిమ్మల్ని మేడం అని పిలుస్తూ ఉంటాను. అలా మీ భర్త కూడా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అలాగే జగన్ నీకు చెబుతున్న విను పవన్ కళ్యాణ్ అంటే నీ దృష్టిలో మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు కానీ పవన్ కళ్యాణ్ అంటే రేపటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు , పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కళలు , పవన్ కళ్యాణ్ అంటే కన్నీరు తుడిచే చేయి, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పరిగెత్తుకుని వచ్చే 108 అంబులెన్స్ , పవన్ కళ్యాణ్ అంటే ఆడపిల్లలకి రక్షణగా చేతికి కట్టే రాఖి , పవన్ కళ్యాణ్ అంటే పెద్దల భుజంపై ఉండే కండువా , పవన్ కళ్యాణ్ అంటే గర్వంతో ఎగిరే జాతీయ జెండా అంటూ పవన్ కళ్యాణ్ ఈ భారీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను మొత్తంగా ముంచేసే తుఫాన్ అంటూ జగన్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు రాజకీయపరంగా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది