Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 28 June 2025, 2:10 pm
  •  ఆ ముగ్గురు బిజెపికి తొత్తులుగా మారారు - షర్మిల

  •  సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్ - షర్మిల

  •  Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీలు ప్రజలను మోసం చేసే పద్ధతిలో రూపొందించబడ్డాయని, అవి సూపర్ ఫ్లాప్ అయాయని షర్మిల ధ్వజమెత్తారు. 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేస్తూ వారి సంక్షేమాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా పీఎం కిసాన్ నిధులు రాకుండా చేసిన ప్రభుత్వం, రైతులకు మద్దతు ధర లేని స్థితి తీసుకొచ్చిందని ఆమె విమర్శించారు.

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : సూపర్ ‘ప్లాప్’ అంటూ కూటమి సర్కార్ పై షర్మిల ఫైర్

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ త‌మ‌కు ప్రజలతో పని లేని వ్యక్తులుగా, బీజేపీకి మాత్రమే లొంగిపోయే నేతలుగా మారిపోయారని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన ఉండాల్సిన నేతలు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించకుండా నిస్సహాయంగా వున్నారని ఆమె మండిపడ్డారు. “జగన్ బీజేపీ దత్తపుత్రుడిగా మారాడు. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క ఉద్యమం కూడా చేయలేదన్నది ప్రజలు గమనించాలి” అని ఆమె హితవు పలికారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైతుల సంక్షేమం వంటి అంశాలపై గళమెత్తగల పార్టీ ఒక్క కాంగ్రెస్‌నేనని ఆమె పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఉన్న ఏకైక నేత రాహుల్ గాంధీ అని, ఆయనకే ప్రధాని పదవి వరించాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి