Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన జగనన్న..!
ప్రధానాంశాలు:
Ys Jagan : విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన జగనన్న..!
వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన నిధులను విడుదల
Ys Jagan : ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న విద్యా దీవెన నిధులను విడుదల చేయబోతోంది. జూలై , సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి 584 కోట్లను 8,09,039 మంది విద్యార్థుల కోసం ఇస్తుంది. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ డబ్బును బటన్ నొక్కి తల్లుల విద్యార్థులు జాయింట్ బ్యాంక్ అకౌంట్లలో నేరుగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జమ చేయబోతున్నారు. దాంతో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుందని సంతోషంలో ఉన్నారు. అందువల్ల సీఎం బటన్ నొక్కిన తర్వాత లబ్ధిదారులు తమ ఎకౌంట్లో డబ్బు వచ్చింది లేనిది చూసుకోవాలి. ఇవాళ ఎకౌంట్లో డబ్బు రాకపోతే బ్యాంక్ అధికారులను సంప్రదించవచ్చు. జగనన్న విద్యా దీవెన కింద ఇవాళ వస్తున్న 584 కోట్లతో కలిపి ఇప్పటివరకు విద్యా దీవెన వసతి దీవెన పథకాల కింద వైసీపీ ప్రభుత్వం రూ. 18,576 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది.
ఇది గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ అని ప్రభుత్వం చెబుతోంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేశారుష పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటిఐ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించే ఫీజులను వారి బదులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం మూడు నెలలకు ఒకసారి డబ్బుని లబ్ధిదారుల ఎకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ డబ్బును మధ్యవర్తులు ఎవరు పొందే అవకాశం లేకుండా నేరుగా తల్లుల ఎకౌంట్లో జమ అవుతాయి. ఆ తర్వాత కాలేజీల యాజమాన్యాలు వారి నుంచి ఆ డబ్బును తీసుకుంటున్నాయి.
పేద విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చులకోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో వైసీపీ ప్రభుత్వం ఐటిఐ విద్యార్థులకు రూ.10,000 పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15000,డిగ్రీ , ఇంజనీరింగ్ , మెడిసిన్ వంటి కోర్సులు చేసే వారికి 20 వేల చొప్పున డబ్బును అందిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు డబ్బు సమస్యలు లేకుండా చదువుకోడానికి వీలవుతుందని జగన్ సర్కార్ చెబుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో విద్యారంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు చేసినట్లు అవుతుంది. ఈ పథకాల ప్రయోజనం పొందుతున్న విద్యార్థులు రేపు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ఆశిస్తుంది. వారి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రభుత్వం నమ్ముతుంది. పేద విద్యార్థులు డబ్బు లేక చదువు ఆపకూడదని జగన్ సర్కార్ ఇలాంటి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా చాలామంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనివలన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.