Ys jagan : రూట్ మార్చిన జగన్.. మళ్లీ అధికారం కోసం ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ఈ సారి చాలా చోట్ల దారుణంగా ఓడింది. ఏకంగా 175 సీట్లకు 164 సీట్లలో కూటమి గెలవగా, అటు వైసీపీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అధికార పక్షం కాదు కాబట్టి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఈ మధ్య జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబు తరచుగా చేస్తున్న ఓ […]
ప్రధానాంశాలు:
Ys jagan : రూట్ మార్చిన జగన్.. మళ్లీ అధికారం కోసం ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు...!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ఈ సారి చాలా చోట్ల దారుణంగా ఓడింది. ఏకంగా 175 సీట్లకు 164 సీట్లలో కూటమి గెలవగా, అటు వైసీపీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అధికార పక్షం కాదు కాబట్టి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఈ మధ్య జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబు తరచుగా చేస్తున్న ఓ వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోందని, పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
Ys jagan జాతీయ రాజకీయాలలోకి..
ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత తనదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నట్లు తెలిపారు. దీంతో జగన్ అధికారం కోల్పోయి విపక్ష హోదా కూడా లేకుండా పోయినా ఇంకా చంద్రబాబును, టీడీపీని భయపెడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జగన్ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతికూల పరిస్థితుల మధ్య అసెంబ్లీకి వెళ్లడానికి జగన్ ఇష్టపడట్లేదని చెబుతున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్.. లోక్‌సభకు పోటీ చేస్తారని అంటున్నారు. పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో జగన్ నిలబడొచ్చని చెబుతున్నారు.
తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గంలో తన తల్లి వైఎస్ విజయమ్మను బరిలో దింపుతారని తెలుస్తోంది. పులివెందుల నుంచి తల్లిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా బలపడింది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంతగా బలమైన పక్షంగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందని జగన్ యోచిస్తోన్నట్లు చెబుతున్నారు.