Categories: andhra pradeshNews

YS Jagan : జగన్ కు మరో షాక్..!

YS Jagan వైసీపీ కి వరుస షాకులు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకు పరిమితం అవ్వగా, విపక్ష కూటమి భారీ విజయం సాధించి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీలో అసంతృప్తి పెరిగింది. ఇప్పటికే పలువురు నాయకులు, ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

YS Jagan : జగన్ కు మరో షాక్..!

మర్రి రాజశేఖర్ 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పటి నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం 2010లో వైఎస్సార్‌సీపీలో చేరి, 2014 ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూశారు. అయినప్పటికీ పార్టీ పట్ల విధేయంగా ఉండి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో జగన్ చేపట్టిన పాదయాత్రలో కీలక భూమిక పోషించారు. అయితే 2019లో చిలకలూరిపేట అసెంబ్లీ సీటును ఆయనకు కేటాయించలేదు. టికెట్ పొందలేకపోయినా, జగన్ హామీ మేరకు ఎమ్మెల్సీగా నియమితులయ్యారు.

కానీ మర్రి రాజశేఖర్‌కు మంత్రిపదవి రాలేదు. దీంతో పార్టీ పట్ల అసంతృప్తి పెరిగింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన వైఎస్సార్‌సీపీని వీడతారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెప్పారు. ఈ పరిణామం వైఎస్సార్‌సీపీలో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీని వీడిన నేపథ్యంలో, మరికొందరు కూడా పార్టీ మారే అవకాశాలపై చర్చలు సాగుతున్నాయి.

Recent Posts

Amala Paul : నా భ‌ర్తకి నేను హీరోయిన్ అనే విష‌యం తెలియ‌దు అంటూ బాంబ్ పేల్చిన అమ‌లాపాల్..!

Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమ‌లాపాల్‌. తెలుగులో ఆరు సినిమాలే…

3 hours ago

Jr Ntr : ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ఎన్టీఆర్‌ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?

Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విష‌యం మ‌నంద‌ర‌కి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…

4 hours ago

Samantha : పెళ్ల‌య్యాక బుద్దొచ్చింది.. నాగ చైత‌న్య చేసిందేమి లేద‌న్న స‌మంత‌..!

Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌-స‌మంత‌లు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…

5 hours ago

Types Of Kisses : శ‌రీరంపై మీరు పెట్టుకునే ముద్దుతో అవ‌త‌లి వ్య‌క్తిపై మీ ప్రేమ‌ను చెప్పొచ్చు తెలుసా?

Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…

6 hours ago

Dinner Before 7 pm : రాత్రి భోజ‌నం 7 గంట‌ల‌కు ముందే ముగిస్తే క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…

7 hours ago

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ - పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్…

8 hours ago

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు…

9 hours ago

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

10 hours ago