Categories: NewsTelangana

BRS MLAs : ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs  : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండిన పంటలతో వచ్చి ఆందోళనకు దిగారు. ఇది ప్రకృతి కారణంగా వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు నష్టం కలిగించడమే కాకుండా, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. “రేవంత్ రెడ్డి పాపం – రైతన్నలకు శాపం” అంటూ నినాదాలు చేశారు.

BRS MLAs : ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs అసెంబ్లీ లో ఎండిన పొలాలతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న దృశ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు బిఆర్ఎస్ నేతలు ఎండిన పంటలతో అసెంబ్లీకి వచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పట్ల ఉన్న ద్వేషంతోనే ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, నీటిని అదుపుగా వదలక పోవడంతోనే పంటలు ఎండిపోయాయని విమర్శించారు.

రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, ఎకరానికి రూ.25,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రైతులకు సకాలంలో నీటి సరఫరా చేయాలని, వారికి రుణ మాఫీ సహా ఇతర లబ్ధిదాయక పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను పట్టించుకోవడం మానేసి, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు న్యాయసహాయం చేస్తోందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Recent Posts

Heart Attack | సిక్స్ కొట్టి కుప్పకూలిన క్రికెటర్‌.. గుండెపోటుతో మృతి చెందాడ‌ని చెప్పిన వైద్యులు

Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…

28 minutes ago

Samantha- Naga Chaitanya | సమంత- నాగచైతన్య విడాకులపై ఎట్ట‌కేల‌కి స్పందించిన‌ నాగ సుశీల

Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…

1 hour ago

Sawai Madhopur | ప్రకృతి ఆగ్రహం.. వరదలతో 55 అడుగులు కుంగిన భూమి.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…

2 hours ago

Kamini Konkar | భర్తను కాపాడాలని అవయవం దానం చేసిన భార్య – నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి

భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…

3 hours ago

Health Tips | మీరు వేరు శెన‌గ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి

Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…

4 hours ago

Heart Attack | గుండెపోటు వచ్చే ముందు ఈ సంకేతాలు క‌నిపిస్తాయ‌ట‌.. అస్సలు నిర్ల‌క్ష్యం చేయోద్దు..

Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి…

5 hours ago

Moong Vs Masoor Dal | పెసరపప్పు-ఎర్రపప్పు.. ఈ రెండింట్లో ఏది ఆరోగ్యానికి మంచిది..?

Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు…

6 hours ago

Health Tips | సన్‌స్క్రీన్ వాడిన వారికి విట‌మిన్ డి లోపం వ‌స్తుందా.. నిపుణుల స‌మాధానం ఏంటంటే..!

Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…

7 hours ago