YS Jagan : అద్ది ఇలాంటి ప్లాన్ కోసమే అందరూ ఎదురు చూస్తోంది, నిమ్మగడ్డ మీద జగన్ మాస్టర్ ప్లాన్ ?
YS Jagan : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. ఎన్నికలు జరిగే ప్రతి చోట కూడా అధికార పార్టీకి సంబంధించిన చిహ్నాలు మరియు పార్టీ గుర్తులను అన్నింటిని కూడా మూసేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా వైకాపా కాని టీడీపీ గుర్తు కాని కనిపించకూడదు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులను ఎక్కడికి అక్కడ కట్టడి చేసే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీలో ఫిబ్రవరి 1 నుండి ప్రారంభం కాబోతున్న రేషన్ సరుకుల డోర్ డెలవరీ పథకం సందిగ్దంలో పడ్డట్లయ్యింది. ఈ పథకంలో భాగంగా రేషన్ సరుకులను ఇంటింటికి అందజేయడం జరుగుతుంది. అందుకోసం వేలాది వాహనాలు సిద్దంగా ఉన్నాయి. ఆ వాహనాలన్నింటి మీద సీఎం మరియు సంబంధిత మంత్రుల బొమ్మలు ఉండబోతున్నాయి.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఇలాంటి సమయంలో సీఎం ఫొటోలు మరియు ఇతర మంత్రులకు సంబంధించిన బొమ్మలతో ప్రచారాలు చేయకూడదు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగానే ఇలాంటి పథకాలు ప్రారంభం చేయకూడదు అనేది రూల్. కాని ప్రభుత్వం మరియు వైకాపా వారు చెబుతున్న దాని ప్రకారం ఈ పథకం కొత్తది కాదు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. నిమ్మగడ్డ రమేష్ ఈ వాహనాలను అడ్డుకునేందుకు చూస్తే మాత్రం సీరియస్ గానే స్పందించాల్సి ఉంటుందని వైకాపా నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల కమీషన్ ఎత్తుగడ్డల నేపథ్యంలో జగన్ ఈ పథకంను ముందే ప్రారంభించాడు. దాంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు.
నిమ్మగడ్డ మాస్టర్ ప్లాన్ లు అన్ని కూడా బెడసి కొట్టి ఈ పథకం ను అడ్డుకోవడంలో ఆయన విఫలం అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది. మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా వెళ్లి ఈ కొత్త వాహనాలను ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రంలో తిరగకుండా చేయాలని భావిస్తున్నారట. అందుకు సాధ్యమేనా అనేది కొందరి మాట. ఒక వేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఈ రేషన్ పంపిణీ వ్యవస్థను ఆపేస్తే ఖచ్చితంగా సామాన్యుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వైఎస్ జగన్ ప్లాన్ అదిరింది. నిమ్మగడ్డ రమేష్ పై ఈ రకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చేయి సాధించినట్లు అయ్యిందని రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.