Ys Jagan – Pawan Kalyan : పిఠాపురంలో జగన్ మాస్టర్ స్కెచ్.. పవన్ ను ఓడంచే అస్త్రం..!
Ys Jagan – Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో అందరి చూపు పిఠాపురం మీదనే ఉంది. ఏపీలో 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నా సరే పిఠాపురంలో ఏం జరుగుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అదేంటి ఏపీలో పవన్ కల్యాణ్ కంటే పెద్ద లీడర్లు ఉన్నారు కదా అంటే ఉన్నారు. జగన్, చంద్రబాబు, లోకేస్, బాలకృష్ణ లాంటి వారు గతంలో తాము పోటీ చేసిన నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి.. ఈ ఎన్నికల్లో పిఠాపురంకు షిఫ్ట్ అయ్యాడు. పిఠాపురంలో కాపు సామాజక వర్గం ఓట్లు 90వేలకు పై చిలుకు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి గెలుస్తానని ఆశ పెట్టుకున్నాడు.
కానీ జగన్ మాత్రం పిఠాపురంలో ఎలాగైనా వైసీపీ గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి కాకినాడ ఎంపీ వంగా గీతను రంగంలోకి దింపారు. గీత కూడా కాపు కులానికి చెందిన మహిళ. పైగా స్థానికురాలు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మొన్నటి వరకు కాస్త అసంతృప్తిగా ఉన్నాడు. దాంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. కానీ దొరబాబును తాడేపల్లికి పిలిపించుకుని జగన్ మాట్లాడారు. దాంతో ఆయన వంగా గీత గెలుపుకోసం కృషి చేస్తానని తెలిపాడు. ఇప్పుడు పిఠాపురంలో గీతను గెలిపించే బాధ్యతను దొరబాబుకు అప్పగించాడు జగన్. దాంతో దొరబాబుతో కలిసి గీత ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఇది సరిపోదని వైసీపీ భావించింది. అందుకే ఇప్పుడు కాపు అగ్ర నేత ముద్రగడ పద్మనాభంను ఇక్కడికి పంపించారు జగన్. దాంతో ముద్రగడ ఇక్కడే ఉంటూ గీతను గెలిపించేందుకు కాపు నేతలతో మాట్లాడుతున్నారు. పవన్ ను గెలిపిస్తే ఇక్కడ ఉండడని..
అదే గీతను గెలపిస్తే ఇక్కడే ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తుందని చెప్పుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ ను గెలిపించినా చంద్రబాబు పల్లకీ మోస్తాడు తప్ప.. కాపులకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. అంతే కాకుండా ఆయన సినిమాల్లోనే బిజీగా ఉంటాడు కాబట్టి.. స్థానికుడు కాదు కాబట్టి ఆయనకు ఓట్లేయొద్దని చెబుతున్నారు. అంతే కాకుండా స్థానికంగా మండలాలకు కీలక నేతలను ఇన్ చార్జులుగా నియమించారు జగన్. అంతే కాకుండా గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయిన శేషుకుమారి, రాధారంగ మిత్రమండలి అధినేత వంగవీటి నరేంద్ర లాంటి వారు వైసీపీలో చేర్చుకున్నారు. అంతే కాకుండా అన్ని పార్టీలకు చెందిన మండలాల నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. ఇలా అన్ని విధాలుగా పవన్ ను ఓడించచేందుకు ప్లాన్ చేస్తున్నారు జగన్.