YS Jagan Mohan Reddy : ఎట్టకేలకి ఢిల్లీలో ధర్నాకి కూర్చున్న జగన్.. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు
YS Jagan Mohan Reddy : గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంపై జగన్ పోరాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ సంచలన ప్రకటన కూడా చేశారు. దేశ రాజధానిలో జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలకు జగన్ ఆహ్వానిస్తూ .. అందరిని ఏకం చేసి తమ పోరాట కార్యక్రమానికి మద్దతు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగానే నేడు(జులై 24) ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైసీపీ కీలక నాయకులంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. జంతర్ మంతర్‌లో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దీక్ష చేపట్టిన జగన్ మరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ రెడ్‌బుక్ పట్టుకున్న ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్న, చంపుతున్న, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
YS Jagan Mohan Reddy : ఎట్టకేలకి ఢిల్లీలో ధర్నాకి కూర్చున్న జగన్.. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు
ఈ రోజు వారు అధికారంలో ఉన్నారని, రేపు తాము అధికారంలోకి వస్తామని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి పాల్పడలేదన్నారు. తామెప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని, కాకపోతే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడాలని కోరారు. ఏపీలో ఈ మధ్య జరిగిన ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఇవాళ్టి ధర్నాతో ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా డిమాండ్ చేశారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.