Fishing Boat : చేపల వేటకి వెళ్లిన బోటుపై దాడి చేసిన తిమింగలం.. భయంతో మరో బోటు వ్యక్తి పరుగు.. వీడియో వైరల్...
Fishing Boat : ప్రపంచంలో అనేక రకాల తిమింగలాలు ఉంటాయనే విషయం మనందరికి తెలిసిందే. 21వ శతాబ్దంలో అనేక జాతుల తిమింగలాలు ఉండగా, వీటిలో చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు గుర్తించారు. అయితే తిమింగలాలు సముద్రంలో ప్రయాణించే బోట్లపై దాడులు చేస్తుండడం పలుమార్లు మనం గమనించడం మనం చూశాం.తాజాగా మెరికాలోని న్యూహాంప్‌షైర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో ఓ భారీ తిమింగలం చేపల వేట పడవపై ఒక్కసారిగా దాడి చేయగా, ఇందుకు సంబంధంచిన వీడియో వైరల్ అయింది.
అయితే ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో బోటుపై తిమింగలం ఒక్కసారిగా దాడి చేయడంతో అది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడవ బోల్తా పడింది. అయితే, అదృష్టవశాత్తూ అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అయితే ఒడియోర్న్ పాయింట్ స్టేట్ పార్క్ సమీపంలో మంగళవారం ఈ ఘటన జరగగా, ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. 23 అడుగుల సెంటర్ కన్సోల్ బోట్‌లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఓ భారీ తిమింగలం వారి బోటు సమీపానికి వచ్చింది.
Fishing Boat : చేపల వేటకి వెళ్లిన బోటుపై దాడి చేసిన తిమింగలం.. భయంతో మరో బోటు వ్యక్తి పరుగు.. వీడియో వైరల్…
అయితే ఒక్కసారిగా నీటి లోంచి గాల్లోకి లేచిన తిమింగలం బోటుపై పడింది. దీంతో బోటు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బోటులోని ఇద్దరి వ్యక్తులు నీటిలో దూకేయగా, మరో వ్యక్తి నీటిలో మునిగిపోయారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా కాపాడారు. అయితే అక్కడే చేపలు పట్టేందుకు వచ్చిన మరో వ్యక్తి ఇదంతా గమనించి తన బోటుని అక్కడ నుండి స్పీడ్ గా లాగించారు. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. సముద్రంలో ప్రయాణించే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచనలు చేస్తున్నారు.
Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే…
Baba Vanga Prediction : అప్పట్లో జపానికి చెందిన బాబా వంగ అంచనాలు తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ఆమె…
Jadcharla MLA : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన…
Raja Singh : గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా బీజేపీ కి రాజీనామా…
Uber Ola : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025 ప్రకారం..…
Chandrababu : పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో…
Singayya wife : సింగయ్య మృతిపై ఆయన భార్య లూర్దు మేరి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త చనిపోయిన…
Drink And Drive : తప్పతాగి వాహనం నడపడం వల్ల రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో డ్రైవ్…
This website uses cookies.