YS Jagan Mohan Reddy : ఆత్మ రక్షణ .. పకడ్బందీ వ్యూహమా..?? వై.యస్.జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా గెలుస్తారా ..??
ప్రధానాంశాలు:
YS Jagan Mohan Reddy : ఆత్మ రక్షణ .. పకడ్బందీ వ్యూహమా..?? వై.యస్.జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా గెలుస్తారా ..??
YS Jagan Mohan Reddy : వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. 20కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జీలను మార్చి కొత్తవారికి బాధ్యతలు అప్పగించింది. ఆ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ లకు టికెట్లు రావాన్న క్లారిటీ ఇచ్చినట్లే అంటున్నారు రాజకీయ పండితులు. దీన్నే అస్త్రంగా మరల్చుకోవాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం బావురు కక్కుతుంది. ఎన్నికల్లో ఎలాగో ఓటమి ఖాయం అని తెలియడంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్లను మారుస్తున్నారు అంటూ టీడీపీ ప్రచారం చేస్తుంది రాబోయేది జనసేన, టీడీపీ కూటమి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత చూపుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవి చూడడంతో ఏపీలో వైయస్సార్సీపి ఓటమి ఖాయమని టిడిపి, జనసేన తో పాటు సిపిఐ సిపిఎం ప్రచారం చేస్తున్న రాబోయేది తమ ప్రభుత్వం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విడివిడిగా ప్రచారంలో వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సిపి పాలన ఎక్స్పైర్ అయిందని నారా లోకేష్ సైతం అంటున్నారు.
ఈ క్రమంలోనే వైయస్సార్సీపీ నాయకత్వం మొదటి విడతలో 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను నియమించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఖాయమని సంకేతాలు ఇచ్చింది. దీనికి ముందే గత ఎన్నికల్లో లోకేష్ పై గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండో విడతలో 10 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జీలను మార్చారు. ఇలా ఇన్ ఛార్జీలను మార్చడాన్ని వైసిపి డిఫెన్స్ లోకి వెళుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం సింహం వేటాడే ముందు నాలుగు అడుగులు వెనక్కు వేసి ఒక్క ఉదుటున ముందుకు దూకుతుంది అని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలకు వైసీపీ ఇన్ ఛార్జిలను మార్చడాన్ని సంబంధం లేదని వైసీపీ అంటుంది. నిజానికి వైయస్సార్ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలల క్రితమే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న సందర్భంలో 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కొంతమందికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు అంతమాత్రాన వాళ్లు నా ఆత్మీయులు కాకుండా పోరు అని కొన్ని నెలల క్రితమే సంకేతాలు ఇచ్చారు. ఏ ఏ నియోజకవర్గాలలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తామో అని సర్వేలు చేయించుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కొద్ది నెలల ముందే దానిని సిద్ధం చేసింది.
దానిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. టికెట్ ఇవ్వలేకపోయినా అధికారంలోకి వచ్చాక మంచి పదవి ఇస్తానని భరోసా ఇస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఏడుగురు మినహా మిగతా వాళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ టికెట్ ఇచ్చారు. గ్రామీణ తెలంగాణలో చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే లపై వ్యతిరేకత ఉంది. కెసిఆర్ పై కానీ ప్రభుత్వంపై కానీ వ్యతిరేకత లేదు. కేవలం వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చుకోవడం వలన కెసిఆర్ హ్యాట్రిక్ విజయాన్ని చేజార్చుకున్నారు. ఏపీలో ఈ పొరపాటు జరగకుండా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అని రాజకీయ పండితులు అంటున్నారు. అభ్యర్థులను మార్చిన తర్వాత వైసిపికి తిరుగు లేదు అనుకుంటే పొరపాటే అవుతుందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.