Ys Jagan : కొత్త ప్రణాళికని అమలు చేస్తున్న జగన్.. సీనియర్స్‌కి పిలుపు…!
ప్రధానాంశాలు:
కొత్త ప్రణాళికని అమలు చేస్తున్న జగన్.. సీనియర్స్‌కి పిలుపు...!
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న జగన్ అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయంగా.. కుటుంబ పరంగా ముప్పేట సమస్యలు ఎదుర్కొంటున్న జగన్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా మంత్రాంగం నడిపిన జగన్ ఇప్పుడు పులివెందులలో కీలక అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ సంబంధాలను ఇప్పుడు వినియోగించుకుంటున్నారు. రాజకీయంగా పోరాటానికి సిద్దం అవుతూనే షర్మిల వివాదం కు కూడా ముగింపు పలికే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది ఆ పార్టీని వీడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో జగన్ కొత్త టీమ్‌తో వచ్చే ఎన్నికలకి వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
Ys Jagan జగన్ కొత్త ఆలోచన..
సీనియర్లను వారి అనుభవాలను వాడుకుంటూనే కొత్త వారికి యంగ్ లీడర్స్ కి చాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం నుంచే దానికి శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు. ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులను రంగంలోకి దించుతారు అని అంటున్నారు.. శ్రీకాకుళం సీటులో ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు రాం మనోహర్ నాయుడిని దించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు నరసన్నపేట నుంచి తన కుమారుడు క్రిష్ణ చైతన్యను ధర్మాన క్రిష్ణ దాస్ ముందుకు తెస్తున్నారు. వీరికే పార్టీ బాధ్యతలు తొందరలో అప్పగిస్తారు అని అంటున్నారు. అలాగే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని రంగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడిని కూడా రంగంలోకి దింపే అవకాశం లేకపోలేదు. అలానే విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుమారుడికి చీపురుపల్లి బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణికి ఇన్చార్జి బాధ్యతలు ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది. అలాగే బొబ్బిలి, సాలూరులలో కూడా కొత్త ముఖాలను తెస్తారని అంటున్నారు. సీనియర్లు పార్టీ కోసం పనిచేయాలని అధినాయకత్వం సూచించే అవకాశం ఉంది కాబట్టి భూమన కరుణాకరరెడ్డి, పేర్ని నాని వంటి వారు పార్టీ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.