Ys Jagan : ఈ పిక్ తో వైసీపీ అభిమానుల్లో మాంచి కిక్కిఇచ్చిందబ్బా..!
ప్రధానాంశాలు:
Ys Jagan : ఈ పిక్ తో వైసీపీ అభిమానుల్లో మాంచి కిక్కిఇచ్చిందబ్బా..!
Ys Jagan : దివంగత నేత వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు ఏ స్థాయిలో చేరుకున్నాయో మనం చూశాం. వారి కుటుంబంలో ఆస్తుల వివాదం కోర్టుల వరకు వెళ్లడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు పలు విమర్శలు చేసుకోవడం కూడా మనం చూశాం. అయితే ఇది కోర్టుల దాకా వెళ్లి రచ్చ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆస్తుల వివాదం తర్వాత మొదటిసారి వైఎస్ జగన్ వైఎస్ విజయమ్మ కలిసి బహిరంగంగా కనిపించారు. దాంతో మీడియా తో పాటు అక్కడ ఉన్న వారికి అది అత్యంత ప్రాధాన్యత సంతరించకున్న వార్త అయింది. జగన్ నాలుగు రోజుల పర్యటన కోసం సొంత జిల్లా కడపకు వచ్చారు. ఆయన పులివెందులలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అక్కడికి తల్లి విజయమ్మ కూడా వచ్చారు.
Ys Jagan క్యూట్ పిక్..
ఈ సందర్భంగా ఆయన తల్లి చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. కుమారుడిని దగ్గరకు తీసుకుని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. అంతకుముందు క్రిస్మస్ వేడుకల కోసం చర్చికి చేరుకున్న జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇడుపులపాయ ప్రేయర్ హాల్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్, విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గురు, శుక్రవారం కూడా మాజీ సీఎం కడప జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, క్రిస్మస్ వేడుకల సందర్భంగా కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు. అయితే కుమారుడిని దగ్గరకు తీసుకొని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పర్యటనలో తల్లి విజయమ్మను జగన్ కలుసుకుని ముచ్చటించడం ఆసక్తిని రేపింది. అయితే ఈ ఇద్దరూ కూడా కొద్ది సేపు మాత్రమే మాట్లాడుకోవడం కనిపించింది. మరోవైపు చూస్తే విజయమ్మకు ఇచ్చిన సరస్వతీ పవర్ ఆస్తులను తిరిగి షర్మిలకు బదిలీ చేయాలని జగన్ గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దంతో కొద్ది నెలల క్రితం ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అన్నా చెల్లెళ్ళు అయిన జగన్ షర్మిల మధ్య తీవ్రమైన ఆస్తి పోరుకు కూడా ఇది దారితీసింది. ఆ తరువాత విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. అలాగే వీడియో బైట్ ని కూడా విడుదల చేశారు. అందులో ఆమె వైఎస్ జగన్ షర్మిల ఇద్దరూ తన బిడ్డలే అన్నారు. రెండు కళ్ళుగా అభివర్ణించారు. అంతే కాదు, ఇద్దరూ కూడా ఆస్తులను సమానంగా పంచుకోవాలని కూడా సూచించారు. ys jagan participated in christmas celebrations with vijayamma