Ys Jagan : మా ప్రభుత్వం వస్తోంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కూటమి నేతలకు వైఎస్ జగన్ వార్నింగ్..!
ప్రధానాంశాలు:
ఏడాది లోనే చంద్రబాబు ప్రభుత్వం లక్షా 75 వేల కోట్లకు పైగా అప్పుడు చేసింది - జగన్
చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి జగన్ సీరియస్ వార్నింగ్
Ys Jagan : మా ప్రభుత్వం వస్తోంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కూటమి నేతలకు వైఎస్ జగన్ వార్నింగ్..!
Ys Jagan : తాడేపల్లిలో Tadepalli జరిగిన విలేకరుల సమావేశంలో YCP వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజల తరఫున పోరాటం ఆపేది లేదని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల వేధింపులకు పాల్పడుతుందని, వడ్డీతో సహా మీ తప్పుడు కేసులకు తగిన మూల్యం చెల్లిస్తాం” అంటూ తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా శ్రీలంకలా తయారుచేస్తూ ప్రజలపై అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిలోనే రూ.1.75 లక్షల కోట్ల అప్పులు చేసి, ఏ పథకాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
Ys Jagan : మా ప్రభుత్వం వస్తోంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. కూటమి నేతలకు వైఎస్ జగన్ వార్నింగ్..!
Ys Jagan : జగన్ కు సినిమా డైలాగులు కూడా చెప్పే స్వేచ్ఛ లేదా..?
రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంపలు మీడియా చానెళ్లు ఒక పక్షాన వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలకు నాణానికి ఒకే వైపు మాత్రమే చూపిస్తున్నాయని విమర్శించారు. ఈ తరుణంలో ప్రజలకు నిజాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసుల స్వేచ్ఛను హరిస్తూ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయించే విధానం రాష్ట్రంలో భయపెట్టే పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు.
రాష్ట్రంలో ఈరోజు ఒకే ఒక్క నిజమైన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని జగన్ పేర్కొన్నారు. మిగిలిన పార్టీలు అధికారంతో భాగస్వాములై, ప్రజల సమస్యలపై స్పందించడం లేదన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి శబ్దం ఇచ్చే పార్టీ ఒక్కటే వైయస్సార్ సీపీ అని వివరించారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన 143 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అసలు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడే బాధ్యతను వైయస్సార్‌సీపీ పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
సినిమా డైలాగులను పోస్టర్లుగా ప్రదర్శించినందుకే యువకులను రిమాండ్‌కు పంపడం దుర్మార్గమని జగన్ మండిపడ్డారు. సినిమా డైలాగులు సెన్సార్ బోర్డు ఆమోదించిందే కానీ, వాటిని ఉపయోగించినందుకు శిక్ష విధించడం అసంబద్ధమని అన్నారు. “నీకు డైలాగ్ నచ్చకపోతే సెన్సార్‌లో తీసేయించు, కానీ రిలీజ్ తర్వాత ప్రజలు వాడితే అరెస్టులు చేయడమేంటీ?” అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితేనే నోటీసులు జారీ చేయడం, కేసుల్లో ‘అండ్ అదర్స్’ వదిలిపెట్టి వారిని ఇన్‌స్టాల్‌మెంట్‌లుగా వేధించడం.. ఇదేనా ప్రజాస్వామ్య పరిరక్షణ అని జగన్ నిలదీశారు. ప్రజల గొంతుని అణచిపెట్టే కుట్రల్ని తాము సహించబోమని స్పష్టంచేశారు.