Ys Jagan : నేడు జగన్ కీలక ప్రకటన చేయబోతున్నాడా.. ప్రత్యేకంగా నేషనల్ మీడియాకి స్వాగతం !
ప్రధానాంశాలు:
Ys Jagan : నేడు జగన్ కీలక ప్రకటన చేయబోతున్నాడా.. ప్రత్యేకంగా నేషనల్ మీడియాకి స్వాగతం !
Ys Jagan : ఎన్నికల్లో ఓటమితో జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఢిల్లీలో దీక్షకి కూడా దిగారు. అయితే గత అయిదేళ్ల కాలంలో జగన్ ఎన్డీఏలో లేకపోయినా అవసరమైన సందర్భాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు రాష్ట్రం లో టీడీపీతో బీజేపీ జత కట్టటంతో జగన్ ఇండి కూటమి నుంచి వచ్చిన మద్దతుతో రాజకీయంగా తనను ఇబ్బంది పెడుతున్న షర్మిల పై గురి పెడుతున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ షర్మిల తాజా ఎన్నికల్లో వ్యవహరించారు.
Ys Jagan ఏం చెప్పబోతున్నారు..
ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా తన టార్గెట్ జగన్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో షర్మిలకి చెక్ పెట్టే విధంగా కూడా ఇప్పుడు జగన్ వ్యవహరిస్తున్నారు. జగన్ ధర్నాకు ఇండి కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పక్షాలు హాజరై మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో ఇండియా కూటమిలో చేరాలని ఆ నేతలు ఆహ్వానించారు. దీంతో జగన్ ఇండి కూటమిలో కలిస్తే షర్మిళ పరిస్థితి అంతే అంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్.. నేడు మీడియా ముందుకు రాబోతోన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. తాడేపల్లిలోకి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటైంది. అయిదు సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలు, విభాగాల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చంద్రబాబు ఇటీవలే విడుదల చేసిన శ్వేతపత్రాలపై కౌంటర్ అటాక్‌కు దిగనున్నారు జగన్.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, శాంతి భద్రతలు, ప్రభుత్వం చేసిన అప్పులపై సమగ్రంగా వివరణ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. 2014- 2019 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలన, 2019- 2024 మధ్య కొనసాగిన తన ప్రభుత్వ పనితీరును అంశాలవారీగా స్పష్టతను ఇవ్వనున్నారు. జాతీయ మీడియానూ ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీడియా సమావేశంలో జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారనే అంచనాలు ఉన్నాయి.