Ys Jagan : కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ యాప్ వస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ యాప్ వస్తుంది..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం.. కూటమి వేధింపులను నమోదు కోసం జగన్ ప్రత్యేక యాప్..!

  •  కూటమి వేధింపుల కోసం టెక్నలాజి సాయం తీసుకుంటున్న జగన్

  •   కూటమి వేధింపులను నమోదు కోసం జగన్ ప్రత్యేక యాప్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, రాజకీయ వేధింపులను నమోదు చేసేందుకు వైసీపీ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్టు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Ys Jagan కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ యాప్ వస్తుంది

Ys Jagan : కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ యాప్ వస్తుంది..!

Ys Jagan కూటమి వేధింపులను నమోదు చేసేందుకు వైసీపీ ఓ యాప్‌ను సిద్ధం చేస్తుంది

ఈ క్రమంలో ఎవరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నా, ప్రభుత్వ అధికారులు లేదా కూటమి నేతలు బలవంతాలు చేస్తుంటే సంబంధిత వివరాలను యాప్ లో నమోదు చేయాలని జగన్ సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను డిజిటల్ ఫార్మాట్లో సేకరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. దీనిద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అధికార దుర్వినియోగాన్ని నిర్ధారించిన ఆధారాలుగా కూడా వాడే అవకాశముందని చెప్పారు.

తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక, ఈ యాప్‌లో నమోదైన ఫిర్యాదులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ప్రజల భద్రత, న్యాయబద్ధత కోసం ఈ యాప్ ఒక సాధనంగా నిలవనుందని తెలిపారు. “ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరి గళాన్ని వినేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది” అని జగన్ పేర్కొన్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది