YS Jagan : పేర్లు రాసుకోండి… వారికి సినిమా చూపిస్తామంటూ జ‌గ‌న్ వార్నింగ్..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 8, 2025, 9:00 pm
  •  YS Jagan : పేర్లు రాసుకోండి... వారికి సినిమా చూపిస్తామంటూ జ‌గ‌న్ వార్నింగ్..!

YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో భేటి అయిన జ‌గ‌న్.. అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులు, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని, వారు ఎక్కడున్నా, సప్త సముద్రాల అవుతల ఉన్నా, రిటైర్‌ అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిని తప్పకుండా సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు.

YS Jagan : పేర్లు రాసుకోండి... వారికి సినిమా చూపిస్తామంటూ జ‌గ‌న్ వార్నింగ్..!

YS Jagan : పేర్లు రాసుకోండి… వారికి సినిమా చూపిస్తామంటూ జ‌గ‌న్ వార్నింగ్..!

YS Jagan సినిమా చూపిస్తా..

రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి, వాటిని చంద్రబాబుకు చూపి, నిలబడిన మీ అందరికీ మీ జగన్‌ హ్యాట్సాఫ్‌ అన్నారు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కేవలం వైయస్సార్‌సీపీని ప్రేమించినందుకు, తనను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నానని జగన్ తెలిపారు.

అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానన్నారు. వారికి పూర్తి న్యాయం చేస్తానన్నారు. వారికి అడుగుడుగునా తోడుగా, అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడని, టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుందని అడిగారు. చూస్తుండగానే ఏడాది గడిచిందని, కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయని జగన్ తెలిపారు. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తా. అది మామూలుగా ఉండదన్నారు.

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp