Ys jagan : జోరు పెంచిన జగన్.. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించే స్కెచ్..!
ప్రధానాంశాలు:
Ys jagan : జోరు పెంచిన జగన్.. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించే స్కెచ్..!
Ys jagan : వైసీపీ అధినేత, ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఈ ఎన్నికలలో దారుణమైన పరాజయం చెందడం మనం చూశాం. అయితే ఓటమికి కుంగిపోకుండా తిరిగి పుంజుకునేందుకు ఆయన కృషి చేస్తున్నాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ హత్య కావడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ శుక్రవారం వినుకొండ వెళ్లారు. మార్గమధ్యలో అభిమానులు జగన్ కాన్వాయ్‌ను ఆపి మరి ఆయన తమ అభిమానాన్ని చూపించారు. విజయవాడ నుంచి వినుకొండకు వెళ్ళాలంటే సాధారణంగా పట్టే సమయం రెండు లేదా రెండున్నర గంటలు. కానీ జగన్‌కు అందుకు దాదాపు రెట్టింపు సమయం పట్టింది. విజయవాడలో జోరు వానలో మొదలైన జగన్ పర్యటన.. అదే వానలో.. అశేష జనవాహిని, అభిమానుల తాకిడి మధ్య కొనసాగింది.
Ys jagan స్పీడు పెంచిన జగన్..
ఇక వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించాక మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా వచ్చే బుధవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని సహా అందరినీ కలుస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కేంద్రానికి వివరిస్తామన్నారు. కచ్చితంగా వీటిపై నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో తప్పకుండా అడ్డుతగులుతాం. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గవర్నర్ ను నిలదీస్తూ, వైసీపీ గళం విప్పుతుంది.
ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏంటి? ప్రతి నెల 1500 అక్కచెల్లెమ్మలకు ఇస్తామన్నారు. బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇవ్వాలి అని జగన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్.. చంద్రబాబు ప్రభుత్వానికి చెక్ పెట్టి రాష్ట్రపతి పాలన తెచ్చేలా ముందుడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజులలో జగన్ ప్రణాళికలు ఎలా ఉండనున్నాయి, ఆయన వేసే స్కెచ్‌లు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.