Ys Jagan : పవన్ కళ్యాణ్ మీద ‘ ప్రాసిక్యూషన్ ‘ మొదలెట్టిన జగన్ .. అసలు ప్లాన్ ఏంటంటే !
Ys Jagan : రెండో దశ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయినా గాని వాలంటీర్లను టార్గెట్ చేసుకొని వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వల్ల వాలంటీర్లు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని వైసీపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని కోర్టుకు లాగాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యి అందుకు తగ్గ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దురుద్దేశపూర్వకంగానే ఈ కామెంట్స్ పవన్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఏ ఆధారాలు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ మీద ఈ రకంగా మాట్లాడటం వల్ల… వాలంటీర్ల ఆత్మగౌరవం దెబ్బతింది అని ప్రభుత్వం భావిస్తుంది. అదే రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల పరువు తీసేలా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినట్లు దీనిపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. తెలిసిన ప్రాంతంలోనే వాళ్లు వాలంటీర్లుగా పనిచేస్తున్న తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలతో.. వాలంటీర్లు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడటంతో.. న్యాయపరంగానే పవన్ మీద చర్యలకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ క్రమంలో ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యవస్థల మీద పవన్ కామెంట్స్ చేసినట్లు ప్రభుత్వం స్వయంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమయింది.
తనకి కేంద్ర నిఘా వర్గాలు చెవిలో చెప్పినట్లు కామెంట్స్ చేసిన సమయంలో పవన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థల మీద కామెంట్స్ చేస్తే న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. సో కోర్ట్ లో పవన్ సరైన ఆధారాలు చూపకపోతే చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా మాత్రమే కాకుండా న్యాయపరంగా కూడా ఎదుర్కోవటానికి జగన్ ప్రభుత్వం సిద్ధమై.. ప్రాసిక్యూషన్ గా చేర్చడం జరిగింది. అంతేకాకుండా మరోసారి ఇష్టానుసారంగా ప్రభుత్వంపై నోరు జారకుండా పవన్ నీ అష్టదిగ్బంధం చేయడానికి జగన్ వాలంటీర్ల విషయంలో హైకోర్టుకు వెళ్లినట్లు రాజకీయాల్లో వినపడుతున్న టాక్.