Vijayasai Reddy : జగన్ మారిపోయాడా..? విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayasai Reddy : జగన్ మారిపోయాడా..? విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి..?

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :24 May 2025,5:43 pm

ప్రధానాంశాలు:

  •  Vijayasai Reddy : జగన్ మారిపోయాడా..? విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి..?

Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాల హీట్ పెరుగుతున్న సమయంలో మద్యం స్కాం అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి అప్పట్లో మద్యం కుంభకోణంపై తాను అన్నీ తెలిసినవాడినని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన్ను సీఐడీ విచారణకు పిలిచి, ఆయన ఇచ్చిన వాంగ్మూలం పార్టీ లోపల కలకలం రేపింది. దీంతో వైసీపీ వర్గాల్లో ఆయనపై అసంతృప్తి పెరిగింది.

Vijayasai Reddy జగన్ మారిపోయాడా విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి

Vijayasai Reddy : జగన్ మారిపోయాడా..? విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి..?

Vijayasai Reddy : జగన్ గతంలో మాదిరి లేడా..? విజయసాయి ఎందుకు ఆలా అన్నాడు..?

తాజాగా ప్రెస్ మీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..విజయసాయి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పదవికి మూడున్నరేళ్ల ముందు రాజీనామా చేసి, ప్రతిపక్ష కూటమిని ఖుషీ చేయాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి అలా వ్యవహరించారని జగన్ విమర్శించారు. ఆయనను “రోగ్ ఎంపీ”గా పేర్కొంటూ, అలాంటి వ్యక్తి చేసే వ్యాఖ్యలకు ఎటువంటి విలువ ఉండదని మండిపడ్డారు. అంతేగాక, ఆయన తెలుగుదేశం పార్టీకి లొంగిపోయారని ఘాటు ఆరోపణలు చేశారు.

జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించినట్లుగా ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తన స్వభావం ఎప్పటికీ మారదని, రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మూడు దశాబ్దాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి అధికారికంగా స్పందిస్తూ, ఆ ప్రకటన తాను విడుదల చేసినది కాదని ఖండించారు. తన తరఫు నుండి వచ్చే అన్ని ప్రకటనలు తన అధికారిక ‘ఎక్స్’ (Twitter) ఖాతా ద్వారానే వెలువడతాయని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై విజయసాయిరెడ్డి ఈ దశలో స్పందించేందుకు ఆసక్తి చూపట్లేదన్న అభిప్రాయం బలపడుతోంది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది