YS Jaganmohan Reddy : ఏపీ రాజకీయాలలోకి వై.యస్.షర్మిల … దీని వెనుక వై.యస్.జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jaganmohan Reddy : ఏపీ రాజకీయాలలోకి వై.యస్.షర్మిల … దీని వెనుక వై.యస్.జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్..!

 Authored By aruna | The Telugu News | Updated on :31 December 2023,4:20 pm

ప్రధానాంశాలు:

  •  YS Jaganmohan Reddy : ఏపీ రాజకీయాలలోకి వై.యస్.షర్మిల ... దీని వెనుక వై.యస్.జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్..!

YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వై.యస్.షర్మిల తెరంగేట్రం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి అయితే తెలంగాణలోనే ఆమె ఏమి సాధించలేకపోయారు. అసలు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఆమెకు ఎన్ని ఓట్లు వచ్చేయో తెలిసేది. కానీ ఆమె పోటీ చేయలేదు. ఇక ఏపీలోకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని, వై.యస్.రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జనాలు ఆమెను ఆదరిస్తే కనీసం ఎమ్మెల్యే అయినా చేస్తారని వాదన గట్టిగా వినిపిస్తుంది. ఏపీలో కనుక ఆమె అడుగుపెడితే వైసీపీ నుంచి షర్మిల కు ఎంతోకొంత వస్తుందని, కేవలం ఎన్నికలకు మూడు నెలల మాత్రమే ఉన్నా, ఆమె తన కొడుకు పెళ్లి హడావిడిలో ఉన్నారు. దీంతో ఎన్నికలలో రాకపోవచ్చు. వచ్చిన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వై.యస్.జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి వై.యస్.షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి దింపుతారని, అది త్వరలో జరగబోతుందని జగన్ యొక్క మాస్టర్ ప్లాన్ తెలుస్తుందని అంటున్నారు.

ఐదు సంవత్సరాల ముందు ఆమె ఎన్నికల్లోకి వస్తే వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీతో ఉన్న వైయస్సార్ ఓటు బ్యాంకు ను గండి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్స్ కి కొన్ని కొద్ది నెలల ముందు ఆమె అడుగుపెడితే ఆమె చీల్చగలిగేది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఈ కాన్సెప్ట్ తోని వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఆమెని పంపుతున్నారని వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ముఖ్యమైన అంశం. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందుకే కలిసి పోటీ చేయలేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసం విడిగా పోటీ చేశారని ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి.

జగన్ షర్మిల వెనుక ఉండి రంగంలోకి దింపితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 ఓట్లు ఉంటే అవి చంద్రబాబుకే పడతాయి. ఆ ఓట్లను షర్మిల చీల్చగలిగితే అది జగన్ కి ఫేవర్ గా ఉంటుంది. అందుకే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని కొన్ని వర్గాలలో టాక్ వినిపిస్తుంది. షర్మిలను దగ్గరుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలలోకి దింపుతున్నారని కొన్ని నియోజకవర్గాలలో టాక్ వినిపిస్తుంది అయితే ఎన్నికలకు కొద్ది సమయం మాత్రమే ఉండడంతో ఇప్పుడు వై.యస్.షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన పెద్దగా ప్రయోజనం ఉండదు. ఐదేళ్ల ముందు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమెను ఆదరించి ఎమ్మెల్యే సీటు అయిన ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పెద్దగా ప్రభావం ఉండదు అని అంటున్నారు. కాబట్టి వైయస్ షర్మిల ఏపీ రాజకీయాలలోకి రాకపోవచ్చు

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది