YS Jagan: వైఎస్ జగన్ ఆయువుపట్టు మీద కొట్టిన నిమ్మగడ్డ ? – వైఎస్ జగన్ కి ప్రాణం ఐన వాలంటీర్ల విషయంలో !!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ తన పంథం నెగ్గించుకున్నారు. అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లినా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను నిలిపి వేయించలేక పోయాడు. రాజ్యాంగ బద్దంగా జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని ఎందుకు పదే పదే కోరుతున్నారు అంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వంను ఉద్యోగ సంఘాలను విమర్శించడంతో చేసేది లేక ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్ తన పవర్ అంతా కూడా ఉపయోగించి వైకాపాకు ప్రయోజనాలు చేకూరకుండా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. వారు గ్రామాల నుండి పట్టణాల వరకు ఉండి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయ్యి ఉన్నారు. వాలంటీర్లలో 90 శాతం వైకాపా వారే ఉన్నారనే విషయం తెల్సిందే. ఆ విషయాన్ని స్వయంగా విజయ సాయి రెడ్డి అన్నాడు.
YS Jagan: ఇందుకే నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికలు వద్దన్నాం..
ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పని చేస్తే ఖచ్చితంగా వైకాపాకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. ఆ విషయంలో వైకాపా కూడా చాలా నమ్మకంగా ఉంది. కనుక నిమ్మగడ్డ రమేష్ చాలా కీలకమైన ఏపీ వాలంటీర్ల వ్యవస్థను స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. సాదారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కూడా ఎన్నికల విధులు కేటాయించాల్సి ఉంటుంది. కాని వాలంటీర్లకు మాత్రం ఎన్నికల విధులు నిర్వహించవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. వైఎస్ జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న వాలంటీర్ల వ్యవస్థను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పక్కకు పెట్టడంతో వైకాపా నాయకులు రగిలి పోతున్నారు. ఇలాంటి పనులు చేస్తాడనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ల వద్దని అనుకున్నాం అంటూ వైకాపా నాయకులు చెబుతున్నారు.
మేము ప్రభుత్వంలో భాగం కాదా..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తో ఈ విషయమై చర్చించాలని కూడా ఆయన భావిస్తున్నాడట. సాధ్యం అయినంత మేరకు వాలంటీర్లను ఉపయోగించుకోవాలని లేదంటే వారిని అవమానించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. ఈ విషయంలో వాలంటీర్ల సంఘం నాయకులు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం లో మేము భాగం అయినప్పుడు ఎందుకు మా సేవలను ఎన్నికలకు వినియోగించరు అంటూ ఆరోపిస్తున్నారు.