ys jagan రూ. 26 కోట్ల విషయంలో జగన్ ని ఫుల్ గా దుమ్ము దులిపేస్తున్నారు .. !
ys jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీ పర్యటనలు చేసినా కూడా బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంకు దక్కింది ఏమీ లేదు. జగన్ చేసిన పర్యటనలు అన్ని కూడా వృదా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీకి కేవలం తన అక్రమాస్తుల కేసు నుండి తప్పించుకోవడం కోసమే జగన్ వెళ్లి వచ్చాడు తప్ప రాష్ట్రంకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు అన్నాడు. సొంత పనుల కోసం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ ధనంను వృదా చేశాడు అంటూ జగన్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్ విమానం, హెలికాప్టర్ల కోసం వినియోగించిన డబ్బుకు సంబంధించిన లెక్కను తెలుగు తమ్ముళ్లు బయటకు తీశారు. మొత్తం రూ.26 కోట్లను వైఎస్ జగన్ గాల్లో తిరిగేందుకు ఖర్చు చేశాడు.
16 నెలల్లో రూ.26 కోట్లు ఏంది సారూ.. ys jagan
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ అధికార బాధ్యతలు చేపట్టి 16 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన ఢిల్లీకి మరియు హైదరాబాద్ కు పలు సార్లు వెళ్లాడు. ప్రత్యేక ప్రైవేట్ జెట్ లోఆయన ప్రయాణం కొనసాగించే వాడు. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లో విచారణకు హాజరు అవ్వడం కోసం ప్రతి వారం ప్రత్యేక విమానంలో వచ్చేవాడు. ఇక నెలలో రెండు మూడు సార్లు ఏదో ఒక పని చెప్పి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేస్తున్నాడు. అది కూడా ప్రైవేట్ జెట్ లోనే. కనుక 16 నెలల్లోనే ఏకంగా రూ.26 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ఏవియేషన్ సంస్థకు వెళ్లాయి. గతంలో చంద్రబాబు నాయుడు తరహాలోనే వైఎస్ జగన్ కూడా ఇలా దుబారా చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రయాణ ఖర్చులైనా తెచ్చావా జగన్..
సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కోసం ఖర్చు చేసిన నిధులు అయినా కేంద్రం నుండి రప్పించలేక పోయాడు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అనుభవ రాహిత్యం వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని కేంద్రం వద్ద నిధులు తీసుకు రావడం లో ఎంపీలు సీఎం మొత్తం వ్యవస్థ కూడా విఫలం అయ్యిందని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజా ధనం నిరుపయోగం చేయడం లో నెం.1 అన్నట్లుగా సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఆ రూ.26 కోట్ల విషయంతో జగన్ ను ప్రతిపక్షం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.