
Ys Sharmila : వైయస్సార్ ని బండ బూతులు తిట్టిన బొత్స సత్యనారాయణ జగన్ కి తండ్రి సమానులట.. వైయస్.షర్మిల..!
Ys Sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకు వైయస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలలో జగన్ గురించి అనేక రకాల విషయాలను బయటపెట్టిన షర్మిల తాజాగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమం లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల జగన్ వ్యాఖ్యలపై స్పందించిన వైయస్ షర్మిల బొత్స సత్యనారాయణ గురించి జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ… ఇటీవల ఓ కార్యక్రమంలో జగన్ బొత్స సత్యనారాయణ గారిని పక్కన నిలిచిపెట్టుకుని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. బొత్స సత్యనారాయణ జగన్ మోహన్ రెడ్డికి తన తండ్రికి సమానులట. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక లో ఆన్ రికార్డు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిపోసాడు. అలాంటివాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స సత్యనారాయణ గారు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని తాగుబోతు అని తిట్టాడు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలని కోరాడు. జగన్మోహన్ రెడ్డి బినామీ అన్నాడు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ. అలాంటి బొత్స గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తండ్రి సమానులట. అసలు వైసీపీ క్యాబినెట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని అనుసరించే ఒక్క నాయకుడైన ఉన్నారా అంటూ ఈ సందర్భంగా షర్మిల ప్రశ్నించింది.
Ys Sharmila : వైయస్సార్ ని బండ బూతులు తిట్టిన బొత్స సత్యనారాయణ జగన్ కి తండ్రి సమానులట.. వైయస్.షర్మిల..!
వైసీపీ క్యాబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కడు వైయస్సార్ కుటుంబాన్ని తిట్టిన వాళ్లే. అలాంటి వారందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేసి కూర్చోబెట్టాడు. అలాంటి వారందరూ జగన్ కు అన్న, తండ్రి, చెల్లెల్లట. కానీ ఆయన కోసం పాదయాత్రలు చేసిన వారు ఆయన కోసం అండగా నిలబడిన వారు మాత్రం అతనికి ఏమీ కారంటూ ఈ సందర్భంగా షర్మిల తెలియజేశారు. ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేటుకు బలైపోయిన వారు కూడా జగన్ కు ఏమీ కారు. అతని కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని పక్కన పెట్టి అలాంటి నాయకులతో జగన్ మోహన్ రెడ్డి తిరుగుతున్నాడని షర్మిల పేర్కొంది. వైసిపి పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకు వెళ్లేవారు ఒక్కడు లేరంటూ షర్మిల ఎద్దేవ చేశారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.