
Ys sharmila : మాకు ఓటు వేయకపోవడానికి కారణమిదే.. షర్మిళ ఓపెన్ కామెంట్స్..!
Ys sharmila : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య పోరుతో పాటు మరో పోటీ అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. అదే కడప లోక్ సభ నియోజకవర్గంలో అక్కా తమ్ముళ్ల మధ్య జరిగిన ఎన్నికల సమరం. కడప లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీచేయగా.. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగడం చర్చనీయాంశం అయింది. అయితే ఎవరు గెలుస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇక్కడ మూడోస్థానానికి పడిపోయారు. ఇక ఆ ఓటమిపై తాజాగా స్పందించారు వైఎస్ షర్మిల. బుధవారం విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన షర్మిల.. తన ఓటమిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
తన ఓటమికి, అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను వెల్లడించారు. కడపలో తాను ఓడిపోవటానికి ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి సమయం లేకపోవటమే కారణమని వైఎస్ షర్మిల విశ్లేషించారు. ఎన్నికల సమయంలో తాను 14 రోజులు మాత్రమే కడపలో ప్రచారం చేయగలిగానని.. మిగిలిన సమయం రాష్ట్రవ్యాప్త ప్రచారానికే సరిపోయిందని చెప్పుకొచ్చింది. అలాగే వైఎస్ఆర్ బిడ్డ పోటీచేస్తోందన్న విషయం గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియలేదని, తన ఓటమికి అదే కారణమన కూడా ఆమె పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేయలేదనే అభిప్రాయాన్ని షర్మిల వ్యక్తం చేశారు.
Ys sharmila : మాకు ఓటు వేయకపోవడానికి కారణమిదే.. షర్మిళ ఓపెన్ కామెంట్స్..!
సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది కాదని చెప్పారు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కల అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు 2018నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి పూర్తి చేయలేదని అన్నారు.ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.