Ys sharmila : మాకు ఓటు వేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే.. ష‌ర్మిళ ఓపెన్ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys sharmila : మాకు ఓటు వేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే.. ష‌ర్మిళ ఓపెన్ కామెంట్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Ys sharmila : మాకు ఓటు వేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే.. ష‌ర్మిళ ఓపెన్ కామెంట్స్..!

Ys sharmila : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారాయో మ‌నం చూశాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య పోరుతో పాటు మరో పోటీ అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. అదే కడప లోక్ సభ నియోజకవర్గంలో అక్కా తమ్ముళ్ల మధ్య జరిగిన ఎన్నికల సమరం. కడప లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీచేయగా.. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే ఎవ‌రు గెలుస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇక్కడ మూడోస్థానానికి పడిపోయారు. ఇక ఆ ఓటమిపై తాజాగా స్పందించారు వైఎస్ షర్మిల. బుధవారం విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన షర్మిల.. తన ఓటమిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

Ys sharmila అదే ఓట‌మికి కార‌ణం..

తన ఓటమికి, అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను వెల్లడించారు. కడపలో తాను ఓడిపోవటానికి ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి సమయం లేకపోవటమే కారణమని వైఎస్ షర్మిల విశ్లేషించారు. ఎన్నికల సమయంలో తాను 14 రోజులు మాత్రమే కడపలో ప్రచారం చేయగలిగానని.. మిగిలిన సమయం రాష్ట్రవ్యాప్త ప్రచారానికే సరిపోయిందని చెప్పుకొచ్చింది. అలాగే వైఎస్ఆర్ బిడ్డ పోటీచేస్తోందన్న విషయం గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియలేద‌ని, త‌న ఓట‌మికి అదే కార‌ణ‌మ‌న కూడా ఆమె పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేయలేదనే అభిప్రాయాన్ని షర్మిల వ్యక్తం చేశారు.

Ys sharmila మాకు ఓటు వేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే ష‌ర్మిళ ఓపెన్ కామెంట్స్

Ys sharmila : మాకు ఓటు వేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే.. ష‌ర్మిళ ఓపెన్ కామెంట్స్..!

సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది కాదని చెప్పారు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కల అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు 2018నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి పూర్తి చేయలేదని అన్నారు.ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది