YS Sharmila : అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. షర్మిలక్క వ్యాఖ్యలపై ట్రోలింగ్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. షర్మిలక్క వ్యాఖ్యలపై ట్రోలింగ్ ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,2:00 pm

YS Sharmila : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీని స్థాపించిన వై.యస్.షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లడం సెన్సేషనల్ గా మారారు. ఇక ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి కల అని, అది నిజం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతో పనిచేశారు అన్నారు. కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా తన శక్తి మేరకు పనిచేస్తానని షర్మిల చెప్పారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని వై.యస్.షర్మిల అన్నారు.

కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని నమ్మకం తనకు ఉందన్నారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. రాహుల్ జోడయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదన్నారు. కేసీఆర్ ను గద్దె దింపాలని వైయస్సార్ టీపీ పార్టీ నుంచి పోటీ చేయలేదని ఆమె అన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వైయస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాహుల్, మల్లికార్జున షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే గతంలో షర్మిల మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తన తండ్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవారు అని వ్యాఖ్యాలు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో కొంతమంది నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఇక ఇప్పుడు వై.యస్.షర్మిల కాంగ్రెస్లోకి చేరారు. మరీ వై. ఎస్. షర్మిల ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తారా లేదా అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది