Ys Sharmila : ష‌ర్మిళ‌కి బుద్దొచ్చిందా.. జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎన్నాళ్ల‌కి మాట్లాడింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Sharmila : ష‌ర్మిళ‌కి బుద్దొచ్చిందా.. జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎన్నాళ్ల‌కి మాట్లాడింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 July 2024,4:13 pm

Ys Sharmila : గ‌త కొద్ది రోజులుగా అన్నా, చెల్లెళ్ల మ‌ధ్య కోల్డ్ వార్ ఏ రేంజ్‌లో న‌డుస్తుందో మ‌నం చూస్తున్నాం. ముఖ్యంగా జ‌గ‌న్‌పై ష‌ర్మిళ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ష‌ర్మిళ విమ‌ర్శ‌లు కూడా జ‌గ‌న్ ఓట‌మిలో భాగం అయ్యాయి. అయితే అటు ఎన్నిక‌ల‌లో ష‌ర్మిళ కూడా ఓట‌మి పాలవ్వ‌డం మ‌నం చూశాం. అయితే తొలిసారి ష‌ర్మిళ జ‌గ‌న్‌కి మ‌ద్దతుగా నిలిచింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి కారణమైంది. డెక్కన్ క్రానికల్ రాసిన కథనంపై మంత్రి నారా లోకేష్ స్పందించడం, వైసీపీ కుట్రగా ఆయన అభివర్ణించడం, విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేయడానికి రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెక్కన్ క్రానికల్ కథనంపైన ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది.

Ys Sharmila అన్న మాట‌కి క‌ట్టుబ‌డి..

ఈ నేప‌థ్యంలో డెక్క‌న్ క్రానిక‌ల్ కార్యాల‌యంపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. దీనిపై మాజీ సీఎం జ‌గ‌న్ రియాక్ట‌య్యారు. ఈ దాడిని ఖండించారు. ఇప్పుడు ష‌ర్మిల కూడా అన్న బాట‌లోనే ఈ దాడిని ఖండించారు. జ‌గ‌న్ అభిప్రాయంతో ఆమె ఏకీభ‌వించ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మొన్నటిదాకా జగన్ నే టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనతో జగన్ అభిప్రాయంతో ఏకీభవించి వైఎస్ షర్మిల మద్దతిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఎదురు ఈ చర్యలా? అంటూ ప్రశ్నించారు.

Ys Sharmila ష‌ర్మిళ‌కి బుద్దొచ్చిందా జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎన్నాళ్ల‌కి మాట్లాడింది

Ys Sharmila : ష‌ర్మిళ‌కి బుద్దొచ్చిందా.. జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎన్నాళ్ల‌కి మాట్లాడింది..!

మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెప్తారని తేల్చి చెప్పారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతేకానీ నిలదీసే గొంతులపై ఉక్కు పాదం మోపొద్దు అంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను కచ్చితంగా వ్యతిరేకిస్తుంది అంటూ షర్మిల పేర్కొన్నారు. ఇలాంటి దాడుల‌ను ప్ర‌జాస్వామ్యం కోసం పాటుప‌డే పార్టీగా కాంగ్రెస్ క‌చ్చితంగా వ్య‌తిరేకిస్తుంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌, ష‌ర్మిల ఒక ఇష్యూపై ఒకేలా స్పందించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. ఓ ప‌త్రికా కార్యాల‌యంపై దాడిని ఎవ‌రైనా ఖండిస్తారు కాబ‌ట్టి ఇందులో జ‌గ‌న్‌, ష‌ర్మిల మాట‌ల‌ను ముడి పెట్టి చూడాల్సిన అవ‌స‌రం లేద‌నే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఎన్నిక‌ల‌కు ముందు మాట‌ల యుద్ధం చేసిన అన్నాచెల్లి ఇప్పుడు ఒకే మాట మాట్లాడ‌టం అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది