YS sharmila : నా కుటుంబం చీలడానికి కారణం ఎవరు..? జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్…!
YS sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల తాజాగా తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగన్ గురించి అనేక రకాల విషయాలను తెలియజేసింది.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ….జగనన్న ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారనే ఒక ఆరోపణ ఉంది. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట..కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చీల్చింది.. నా కుటుంబాన్ని కూడా చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయస్థితిలో ఉంది అంటే దానికి గల కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు మరియు ఇక ఇప్పుడు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.
ఇక ఈరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ రెండు గా చీలింది అంటే అది చేతులారా చేసుకుంది జగనన్న గారు. ఇక దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగనన్న పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్లను మంత్రులను చేస్తానని మాట ఇచ్చాడు జగనన్న. మరి ఈరోజు వారిలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు మీరే చెప్పండి. వాళ్లు రాజీనామాలు చేస్తే వారి కోసం నేను అమ్మ తిరిగాం. వారి గెలుపుకు బాట పట్టినం. వారిని గెలిపించాం. ఆ తర్వాత వైసిపి పార్టీ ఇబ్బందుల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమంటే , మా ఇంటి నీ పిల్లలని అందరినీ పక్కనపెట్టి ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి పాదయాత్ర చేశాను. రోడ్లమీదనేే పడుకున్నాను. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసాను. ఆ తర్వాత సమైకాంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం అది కూడా చేశాను.
ఇలా ఏది చేయమంటే అది ఎలాంటి స్వలాభం చూడకుండా చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారు. మాకు అన్యాయం జరిగినప్పటికీ తాను ముఖ్యమంత్రి అయి రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబడితే చాలు , ఆయన ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్న. కానీ గెలిచిన తర్వాత వారంతా బిజెపికి బానిసలుగా మారారని షర్మిల చెప్పుకొచ్చింది. ఈ విధంగా సభలో జగన్ పై షర్మిల విరుచుకుపడింది.