YS Sharmila : పసుపు చీర కట్టుకుంటే తప్పేముంది రా… బట్టలిప్పి తిరగమంటావా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : పసుపు చీర కట్టుకుంటే తప్పేముంది రా… బట్టలిప్పి తిరగమంటావా…!

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా వైయస్ఆర్ కుటుంబానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి మరియు వైయస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇరువురు నువ్వా నేనా అన్న రీతిలో ఒకరిపై ఒకరు విస్తృతంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : పసుపు చీర కట్టుకుంటే తప్పేముంది రా... బట్టలిప్పి తిరగమంటావా...!

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా వైయస్ఆర్ కుటుంబానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి మరియు వైయస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇరువురు నువ్వా నేనా అన్న రీతిలో ఒకరిపై ఒకరు విస్తృతంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..వైయస్ షర్మిల కట్టుకున్న చీరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు చీర కట్టుకుందని చంద్రబాబుతో అంతర్గతంగా పొత్తుకుదురుచుకుందని షర్మిలను ఉద్దేశిస్తూ జగన్ ఆరోపణలు చేశారు.

YS Sharmila : పసుపు రంగు ఏమైనా చంద్రబాబు కొన్నాడా…?

అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించిన వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…మా జగనన్న షర్మిల పసుపు చీర కట్టుకుందని కోట్లాదిమంది ప్రజల సమక్షంలో సొంత చెల్లి అని కూడా చూడకుండా నేను కట్టుకున్న చీర గురించి హేళన చేస్తున్నారు. పసుపు చీర కట్టుకుందని చంద్రబాబుతో అంతర్గత పొత్తు పెట్టుకుంది అంటూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నాడు. పసుపు రంగు కట్టుకుంటే తప్పా.. అదేమైనా చంద్రబాబు కొన్నాడా అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. సాక్షి పేపర్ మొదటి పేజీ కూడా పసుపు రంగులోనే ఉంటుంది కదా.. ఆ పత్రికకు ఇప్పుడు మీరే యజమానులు కదా దానికి ఏం సమాధానం చెబుతారు అంటూ షర్మిల ప్రశ్నించింది.

YS Sharmila పసుపు చీర కట్టుకుంటే తప్పేముంది రా బట్టలిప్పి తిరగమంటావా

YS Sharmila : పసుపు చీర కట్టుకుంటే తప్పేముంది రా… బట్టలిప్పి తిరగమంటావా…!

సాక్షి పత్రికను ప్రారంభించినప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పసుపు రంగు ఉన్న పర్లేదని పత్రికను స్థాపించారు. పసుపు రంగు ఉన్నంత మాత్రాన అది వారిది కాదంటూ రాజశేఖర్ రెడ్డి ఆనాడు చెప్పినట్లు తెలిపారు. అంతేకాక పసుపు అనేది మంచికి శుభ శకునం కాబట్టి దానిని రాజశేఖర్ రెడ్డి గారు సాక్షి పత్రికలో కూడా ఉపయోగించారని తెలియజేశారు. అదేవిధంగా ఇంట్లో కూడా పసుపును వినియోగిస్తున్నాం కదా అది కూడా చంద్రబాబుదేనా అంటూ ఈ సందర్భంగా షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎవడో రాసిచ్చిన పేపర్ ను అమాంతం అలాగే చదివేస్తున్నాడని , కాస్త తెలివి ఉపయోగించి మాట్లాడాల్సిందిగా షర్మిల తెలిపింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది