
YS Sharmila : బాబాయ్ ని చంపినంతా ఈజీ కాదు నన్ను చంపడం.. వైయస్ జగన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్ షర్మిల..!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల ఢిల్లీకి వెళ్లారు. అక్కడ దీక్ష కూడా చేపట్టారు.హోదా విషయంలో టీడీపీ, వైసీపీ పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ మాట్లాడిన వీడియోలను కూడా ప్రదర్శించారు. ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ హీనంగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి టీడీపీ, వైసీపీ గులాం గిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ హోదాపై పోరాడటం లేదన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని అన్నారు. వీరంతా మోడీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ, టీడీపీలు హోదాపై ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నారు. హామీలను నెరవేర్చలేదు. ఇవాళ అధికారంలో ఉన్నవారు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారు. వీరంతా ఇప్పుడే ఏమైపోయారు. ఏపీలో బీజేపీ కి ఒక్క సీటు లేదు. కానీ వీరంతా వారికి గులాం గిరి చేస్తున్నారు. అసలు మీ మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలి. ఇలాగే పరిస్థితుల్లో ఉంటే పోలవరం, రాజధాని, కడప స్టీల్ ఎప్పుడు తీసుకోచ్చుకుంటాము. ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వచ్చేది కాదా ఇదంతా మోడీని ప్రశ్నించారని వైఎస్ షర్మిల నిలదీశారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్ ఇద్దరు కూడా హోదా కోసం పోరాడుతామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్మ హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కదా అని అన్నారు.
అన్ని విషయాలలో మోసం చేసిన బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని అన్నారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికి నెరవేర్చలేదు. దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. చివరకు విశాఖ స్టీల్ ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.