
Nani : నానీది మరీ ఇంత మంచితనమా.. ప్రభాస్ కోసం ఏకంగా పాన్ ఇండియా చిత్రం వదులుకున్నాడా..!
Nani : తెలుగులో పాన్ ఇండియాల హవా మొదలైంది.2024 లోనే రెండు సెన్సేషనల్ హిట్స్ పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా అందించగా ఇక ముందు రోజుల్లో కూడా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. కాగా ఈ లిస్ట్ లో గత కొన్ని రోజులు కితమే అనౌన్స్ చేసిన క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ సినిమా. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలుతో ఆరంభించగా ఈ సినిమా 1940 టైం లో జరిగే యుద్ధ నేపథ్యంలో కనిపించే సినిమా అన్నట్టుగా సినిమా కాన్సెప్ట్ కూడా రివీల్ చేశారు. అయితే ఇపుడు తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఈ సినిమాపై వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ సినిమాకి హీరోగా ప్రభాస్ మొదటి ఛాయిస్ కాదు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. హను రాఘవపుడి ముందుగా ఈ సినిమాకు మరో హీరోను అనుకున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. ఈ సినిమా కథను నేచురల్ స్టార్ నాని కోసం ముందుగా హను రాఘవపూడి డిజైన్ చేశారట. ఇప్పుడు ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీతారామం సినిమా తర్వాత హను రాఘవపుడి నానితో సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో ఈ వార్త తెగ హల్ చల్ చేసింది. ఆ సినిమా కూడా పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని కూడా టాక్ వచ్చింది.
Nani : నానీది మరీ ఇంత మంచితనమా.. ప్రభాస్ కోసం ఏకంగా పాన్ ఇండియా చిత్రం వదులుకున్నాడా..!
కానీ ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేశారు హను. అయితే నాని కోసం డిజైన్ చేసిన కథతోనే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి, మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. సీతారామం సినిమాను కూడా హను రాఘవపుడి పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపుడితో సినిమా చేస్తున్నారు. ఆతర్వాత సలార్ 2 , కల్కి 2లతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తోన్న సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.