YS Jagan : వైసీపీ ఎమ్మెల్యే ని మిమిక్రీ చేసింది ఎవరు ? జగన్ వెరీ సీరియస్ ?
YS Jagan : ఏపీలో పంచాయితీ ఎన్నికల వేడి కొనసాగుతుంది. అధికార వైకాపా సాధ్యం అయినంత వరకు ఏకగ్రీవంకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏకగ్రీవం అయిన దాదాపు అన్ని చోట్ల కూడా వైకాపా అభ్యర్థులే బరిలో ఉంటున్నారు. కనుక ఇది బెదిరించి చేస్తున్న ఏకగ్రీవాలు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది లో జరగాల్సిన ఎన్నికల్లోనే ఏకగ్రీవాలు భారీగా అవ్వడం పట్ల ఎన్నికల కమీషన్ సీరియస్ అయ్యింది. ఏకగ్రీవాల కోసం బలవంత పెట్టడం కరెక్ట్ కాదని ఈ సందర్బంగా ఈసీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా వైకాపా వారు ఏకగ్రీవాలకు అది కూడా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా వైకాపా ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి ఒక సర్పంచ్ అభ్యర్థిని బలవంతంగా పోటీ నుండి తప్పుకోవాలని హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యేపై సీఎం జగన్ సీరియస్..: YS Jagan
ఇప్పటికే బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలా రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మెల్యే పట్టుబడటం పట్ల సీఎం వైఎస్ జగన్ ఆగ్రహంతో ఉన్నాడు. ఇలా పార్టీ పరువు తీసేలా ప్రవర్తించడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఏకగ్రీవాలు చేయాలి కాని ఇలా బయటటకు తెలిసే విధంగా చేయడం పట్ల ఎమ్మెల్యే తీరును పార్టీ నాయకులు కూడా తప్పుబడుతున్నారట. సర్పంచ్ అభ్యర్థి తనను ఎమ్మెల్యే బెదిరించాడు, తనను తప్పుకోవాలంటూ హెచ్చరించాడు అంటూ ఫోన్ రికార్డింగ్ ను పోలీసుల ముందు ఉంచి ఫిర్యాదు చేశాడు.
అది నా వాయిస్ కాదు, మిమిక్రీ చేశారంటున్న ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి పై సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వివాదం ముదిరింది. ఎమ్మెల్యే ఆ విషయమై స్పందిస్తూ తన వాయిస్ కానే కాదు. కొన్ని వాయిస్ లను ఎడిట్ చేసి మిమిక్రీ చేసి నా వాయిస్ లా మార్చారు. నేను ఎవరిని బెదిరించలేదు. ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో అభివృద్ది జరగాలంటే ఏకగ్రీవాలకు సహకరించాలని కోరాను. అంతే తప్ప నేను ఎవరిని బెదిరించలేదు. ప్రజలు వైకాపా పక్షాన ఉన్నారు. కనుక ఎవరిని బెదిరించి ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఎమ్మెల్యే ఉప్పలపాటి అంటున్నారు. కాని ఈ విషయంలో మాత్రం సీఎం వైఎస్ జగన్ ఆగ్రహంతో ఉన్నట్లుగా మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.