YSRCP : జాతీయ రాజకీయాల్లో వైసీపీ చరిష్మా.. అదే జరిగితే కింగ్ మేకర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YSRCP : జాతీయ రాజకీయాల్లో వైసీపీ చరిష్మా.. అదే జరిగితే కింగ్ మేకర్..!

YSRCP  : ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల మీదనే ఉంది. ఎందుకంటే ఈసారి బీజేపీకి సమానంగా ఇండియా కూటమి గట్టిగానే ఉంది. దాంతో ఎవరు అధికారంలోకి వస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే బీజేపీపై చాలా వర్గాలు కోపంతో ఉన్నాయి. పైగా ఈ సారి లోకల్ పార్టీలు అన్నీ కూడా ఎన్డీయే కూటమికి మద్దుతు తెలుపుతున్నాయి. దాంతో ఈ సారి ఎన్డీయే కూటమి కూడా చాలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  YSRCP : జాతీయ రాజకీయాల్లో వైసీపీ చరిష్మా.. అదే జరిగితే కింగ్ మేకర్..!

YSRCP  : ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల మీదనే ఉంది. ఎందుకంటే ఈసారి బీజేపీకి సమానంగా ఇండియా కూటమి గట్టిగానే ఉంది. దాంతో ఎవరు అధికారంలోకి వస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే బీజేపీపై చాలా వర్గాలు కోపంతో ఉన్నాయి. పైగా ఈ సారి లోకల్ పార్టీలు అన్నీ కూడా ఎన్డీయే కూటమికి మద్దుతు తెలుపుతున్నాయి. దాంతో ఈ సారి ఎన్డీయే కూటమి కూడా చాలా బలంగానే మారిపోయంది. దేశంలో ఇప్పటికే ఐదు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే ఛాన్స్ లేదని చాలా సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

YSRCP  న్యూట్రల్ గా వైసీపీ..

అందుకే ఈ సారి బీజేపీకి మహా అయితే 200ల సీట్లు వస్తాయని అంటున్నారు. మిత్ర పక్షాలతో కలిపితే ఇంకో 50 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఈ సారి మ్యాజిక్ ఫిగర్ 272 మాత్రం ఎన్డీయే కూటమికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. దాంతో ఎన్డీయేకు బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల కోసం మోదీ చూస్తున్నారంట. అలా చూసుకుంటే ఒడిశాలో బీజేడీ పార్టీ ఉంది. ఇంకోవైపు ఏపీలో వైసీపీ పార్టీ మాత్రమే ఉంది. వైసీపీ న్యూట్రల్ గా ఉంది. కాబట్టి ఈ సారి వైసీపీకి 15 ఎంపీ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వైసీపీ మద్దతు తీసుకోవాలని బీజపీ చూస్తోంది. 15 సీట్లు అంటే బీజేపీకి ఇవి చాలా అవసరం.

YSRCP జాతీయ రాజకీయాల్లో వైసీపీ చరిష్మా అదే జరిగితే కింగ్ మేకర్

YSRCP : జాతీయ రాజకీయాల్లో వైసీపీ చరిష్మా.. అదే జరిగితే కింగ్ మేకర్..!

కాబట్టి వైసీపీతో దోస్తీ కోసం బీజేపీనే ముందకు వస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉంది. నేరుగా టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి ఒకవేళ వైసీపీ సపోర్టుతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు అవుతారు. కాబట్టి దానికి వైసీపీ ఒప్పుకోకపోవచ్చు. టీడీపీని పక్కకు పెట్టాలని కండీషన్ పెట్టొచ్చు. అంతే కాకుండా వైసీపీ నుంచి కేంద్రమంత్రులు కావాలని కండీషన్ తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర విషయాలపై ముందే డిమాండ్ చేసి సపోర్టు ఇవ్వొచ్చు. అయితే కేవలం బీజేపీతోనే కాకుండా అటు ఇండియా కూటమికి కూడా వైసీపీ మద్దతు ఇచ్చేఅవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి లబ్ది పొందాలని వైసీపీ చూస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది