YSRCP : ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో సీట్ల మార్పిడి వ్యవహారం గ్రూపు రాజకీయాలకు ఊపిరిపోస్తుందా….? కొత్తగా రంగంలోకి దిగిన అభ్యర్థులకు లోకల్ సమస్యలు అర్థం కావడం లేదా…? అందుకే గ్రామాలలో కొత్త గురుకుల ఏర్పడుతున్నాయా…? దీనికి వైసిపి దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి…?అధికార వైసిపికి ఉమ్మడి గుంటూరు జిల్లా సీట్ల మార్పిడి వ్యవహారం కొత్త సమస్యలకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతుంది. రూరల్ ప్రాంతంలో ఒకలాగా అర్బన్ లో మరోలాగా లెక్కలు తేరి మీదకు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు వేమూరు , చిలకలూరిపేట , పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేలను వేరే ప్రాంత ఇన్ చార్జి గా నియమించిన వైసిపి అధిష్టానం రెండు నియోజకవర్గాలలో కొత్తవారిని నియమించింది. అందులో ఒకటి పత్తిపాడు మరొకటి వేమూరు. అయితే పత్తిపాడు నుంచి బలసాని కిరణ్ కుమార్ సమన్వయకర్తగా నియమించారు. అయితే మాల సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ పత్తిపాడులో ఇప్పటివరకు అదే కమ్యూనిటీకి చెందిన మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. అయితే కొన్ని గ్రూపు వివాదాల కారణంగా ఆమెను తాడికొండ నియోజక వర్గానికి పంపించారు. అయితే అదే సమాజిక వర్గానికి చెందిన వేరే వ్యక్తిని సమన్వయకర్తగా పెడితే బాగుండేది అనే డిమాండ్ ని పక్కన పెట్టి నాన్ లోకల్ క్యాండిడేట్ అయిన బలసాని కిరణ్ ను ఇన్చార్జిగా నియమించారు.
దానితో నియోజకవర్గంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ గ్రూపులు ఏర్పడ్డాయని ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు బలసాని కూడా నియోజకవర్గంలో అందర్నీ కలుపుకొని పోవట్లేదు అన్న విమర్శ ఉంది. ఇక పత్తిపాడు దాదాపుగా పూర్తిగా గ్రామీణ వాతావరణం నేపథ్యంలోనే ఉంటుంది. కాకుమాను ప్రాంతం నుంచి గుంటూరు రూరల్ ప్రాంతం వరకు విస్తరించి ఉండే ఈ నియోజకవర్గంలో పల్లెటూరులో ఉండే గ్రూప్ రాజకీయాలు ఆ తరహా వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ చిన్న కార్యక్రమం పెట్టిన గ్రూపులను కలుపుకోవాలనే డిమాండ్ ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో ఈ గోల నుంచి బలసాని కిరణ్ కుమార్ తప్పించుకునే పనిలో పడ్డారని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు మాదిగ సామాజిక వర్గం కూడా కొంత అసంతృప్తిగా ఉందని తెలుస్తుంది. ఆ కమ్యూనిటీ వాళ్లు తనకు అనుకూలమైన అభ్యర్థిని పెడితే బాగుండేది అనే డిమాండ్ వినిపించడంతో అసలు వివాదం అధిష్టానం దగ్గరకు వెళ్ళింది. మరోవైపు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తొక్క మాణిక్య వరప్రసాద్ కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరిన మాజీ మంత్రి రాతల కిషోర్ కూడా అన్ని కమ్యూనిటీకి చెందిన నేత కావడంతో పత్తిపాడు నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
బయట ప్రాంతం నుంచి అభ్యర్థులు తీసుకువస్తే గ్రామీణ ప్రాంతాల్లో గ్రూప్ రాజకీయాల్లో అర్థం కాని పరిస్థితి ఉందని ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని స్థానికంగా వినిపిస్తున్న మాట. దీనికి తోడు ఇప్పుడు బలసాని ని కూడా మారుస్తారని కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారని ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో మాజీ ఐఆర్ఎస్ విలన్స్ వైసిపి సమన్వయకర్తగా పత్తిపాడు రాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న గ్రూపు రాజకీయాలను పరిష్కరించాలి అంటే అభ్యర్థిని మార్చాలా లేక కార్యకర్తల మైండ్ సెట్ మార్చాలా అనేది అధిష్టానం ముందు ఉన్న సవాల్. మరి దీనిని ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.