
ysrcp ఊ.. అంటే మేము రెడీ.. టీడీపీలోకి జంప్ అయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు....
Ysrcp : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో కనీసం ప్రతిపక్షం కూడా దక్కలేదు. అయినప్పటికీ పార్టీ నేతలకు జగన్ భరోసా ఇస్తున్నారు. తిరిగి ప్రజా మద్దతు ఉంటుందని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు చంద్రబాబు పాలన – పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి తాజాగా గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోని ముఖ్యులతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మార్పు ఖాయమని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు రాజకీయంలో చాలా తేడా కనిపిస్తుంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
టీడీపీలోకి వచ్చేందుకు ఊ..
పాలనా పరంగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పలకరించేవారు కరువయ్యారు. భారీ ఓట్ల తేడాతో జిల్లాలో ఓటమి పాలు కావడంతో వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.కడపకు చెందిన శాసనమండలి సభ్యురాలు, మండలి వైస్ చైర్‌పర్సన్ జకియా ఖానమ్ కు వైసీపీలో విలువలేదని, పార్టీలో గత ఐదేళ్లలో తమను పట్టించుకోలేదని, ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇక టీడీపీలో ఉండి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తిరిగి సొంతగూటికి చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వీరే కాకుండా 5 నుండి ఆరుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్.
ysrcp ఊ.. అంటే మేము రెడీ.. టీడీపీలోకి జంప్ అయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు….
ఇక ఏపీ శాసనమండలిలో 58 మంది సభ్యులకు గాను వైసీపీకి 30 మంది, టీడీపీకి 9, జనసేనకు 1, పీడీఎఫ్ కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. మరో నలుగురు వైసీపీని వీడడంతో వారిపై అనర్హత వేటు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులంతా ఇప్పుడు మాజీలయ్యారు. వారి వద్దకు వైసీపీ శ్రేణులు వెళ్లడం లేదు. శిబిరాలన్నీ ఖాళీ అయిపోయాయి. అయితే వైసీపీ వాళ్లు వస్తా అన్నా కూడా దరి చేరనివ్వొద్దని తెలుగు తమ్ముళ్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.