Amaravati : రాజధాని అమరావతిలో ఊపందుకుంటున్న భూముల ధరలు..!!
Amaravati : 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విభజన జరిగిన ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించడం తెలిసిందే. అయితే అమరావతి రాజధానిగా ప్రకటించడం వెనకాల కుట్ర ఉందని ప్రతిపక్ష నేతగా జగన్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం 2019 ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెర పైకి తీసుకొచ్చి అమరావతితో పాటు వైజాగ్… కర్నూలు ప్రాంతాలలో రాజధానిని విస్తరించబోతున్నట్లు తెలిపారు.
జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో భూముల ధర అమాంతం పడిపోవడం జరిగింది. ఇదే సమయంలో మూడు రాజధానుల ప్రకటనపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మరోపక్క రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో రాజధాని రైతుల ఉద్యమానికి పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగాయి. పరిస్థితి ఇలా ఉండగా మూడు రాజధానులు ప్రకటనతో పడిపోయిన అమరావతి భూముల ధరలు ఇటీవల అమాంతం పెరిగాయి.
దానికి కారణం చూస్తే రాజధాని ప్రాంతంలో రెండు బైపాస్‌లు రానుండటంతో ఊపందుకుంటున్నాయి.. రాజధాని గ్రామాల్లో చదరపు గజం రూ. 8 వేలు ఉండగా ప్రస్తుతం 18 వేలకు చేరింది. జాతీయ రహదార్ల అనుసంధానంతో బైపాస్‌లు ఏర్పాటుకానున్న నేపథ్యంలో రియల్ వ్యాపారంలో కదలికలు మొదలయ్యాయి. ఈ పరిణామంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంది. దీంతో మళ్లీ భూముల కొనుగోలుకు.. చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.