YSRCP MLA : జగనన్న అలీని కాదని నాకే నెల్లూరు టికెట్ ఎందుకు ఇచ్చాడంటే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YSRCP MLA : జగనన్న అలీని కాదని నాకే నెల్లూరు టికెట్ ఎందుకు ఇచ్చాడంటే…!

YSRCP MLA : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వై నాట్ 175 నినాదంతో అధికార వైసీపీ పార్టీ జోరుగా ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. అయితే నెల్లూరు టికెట్ విషయంలో మొదట్లో ఎన్నో పేర్లు వినిపించినప్పటికీ ఖలీల్ అహ్మద్ కు జగన్ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టికెట్ పై సినీ నటుడు అలీ పేరు కూడా పెద్ద ఎత్తున […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  YSRCP MLA : జగనన్న అలీని కాదని నాకే నెల్లూరు టికెట్ ఎందుకు ఇచ్చాడంటే...!

YSRCP MLA : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వై నాట్ 175 నినాదంతో అధికార వైసీపీ పార్టీ జోరుగా ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. అయితే నెల్లూరు టికెట్ విషయంలో మొదట్లో ఎన్నో పేర్లు వినిపించినప్పటికీ ఖలీల్ అహ్మద్ కు జగన్ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టికెట్ పై సినీ నటుడు అలీ పేరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ టికెట్ ఖలీల్ అహ్మద్ ను వరించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖలీల్ అహ్మద్ తనకు నెల్లూరు టికెట్ ఇవ్వడం పై క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖలీల్ ను యాంకర్ మాట్లాడుతూ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ పై మైనారిటీ లోనే చాలామంది పేర్లు వినిపించాయి. దానిలో సినీ యాక్టర్ అలీ గారి పేరు కూడా బాగా వినిపించింది. కానీ అలీ గారికి టికెట్ ఇవ్వకుండా సడన్ గా మీకెందుకు టికెట్ కన్ఫర్మ్ చేశారు అని అడిగింది.

YSRCP MLA : ఆలీని కాదని నాకే టికెట్ ఎందుకిచ్చారంటే…

దీనికి ఖలీల్ సమాధానం ఇస్తూ…ఆల్రెడీ నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో గెలిచి కార్పొరేటర్ అయ్యాను. ఆ సమయంలో నెల్లూరు అభ్యర్థికి మేయర్ అవకాశం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆయన టీడీపీ పార్టీలో చేరారు. ఆయన పోత పోత ముస్లిం కార్పొరేటర్స్ అందర్నీ తీసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో నాకు కోటి రూపాయలు ఇస్తానని చేపిన నేను వెళ్లకుండా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను. ఆ తర్వాత రెండోసారి కూడా మళ్లీ నేనే గెలిచాను. ఈ క్రమంలోనే నా నిజాయితీ నా మీద ఎలాంటి తప్పుడు ఆరోపణలు లేకపోవడంతో నాకే టికెట్ ఇచ్చినట్లుగా ఆయన తేలిపారు. అలాగే నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలో అలీ గారి పేరు ముందు నుంచి లేదని మధ్యలో కొన్ని టీవీ చానల్స్ అలా ప్రచారాలు చేసాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఒకవేళ ఆయన వైఎస్ఆర్సిపి నుండి టికెట్ ఆశిస్తే ఆయన నెటివ్ ప్లేస్ లో ఆశిస్తారు కానీ నెల్లూరు నుంచి కాదంటూ తెలియజేశారు.

YSRCP MLA జగనన్న అలీని కాదని నాకే నెల్లూరు టికెట్ ఎందుకు ఇచ్చాడంటే

YSRCP MLA : జగనన్న అలీని కాదని నాకే నెల్లూరు టికెట్ ఎందుకు ఇచ్చాడంటే…!

అలాగే నెల్లూరు టికెట్ నాకు కాదని పార్టీ అధిష్టానం వేరే వారికి ఇచ్చిన సరే నా పని నేను చేసుకునే వాడినని , పార్టీకి కచ్చితంగా కట్టుబడి ఉండే వ్యక్తినంటూ ఈ సందర్భంగా ఖలీల్ తెలిపారు. అలాగే పార్టీలో నేను ఇప్పటివరకు ఏమీ ఆశించలేదని ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశించలేదని నాకు అంత స్తోమత కూడా లేదని తెలిపారు. ఇక ఇదే విషయాన్ని జగన్ కు కూడా తెలిపినట్టు ఆయన తెలియజేశారు. మీరు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నప్పటికీ నాకు దాన్ని నిలబెట్టుకునే స్తోమత లేదంటూ ఖలీల్ జగన్ తో చెప్పినప్పుడు అంత మేము చూసుకుంటాం మీరు వెళ్లి మీ పని చూసుకోండి అంటూ జగన్ చెప్పినట్లుగా ఆయన తెలిపారు. అయితే నెల్లూరు నుండి అలీ పేరు మధ్యలో వినిపించిందని దానిలో ఎలాంటి వాస్తవం లేదంటూ ఈ సందర్భంగా ఖలీల్ తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది