YSRCP : ఆ 82 స్థానాల్లో అభ్యర్థులను మార్చుతున్న జగన్.. అభ్యర్థుల పేర్లు ఇవే.. జాబితా వైరల్
ప్రధానాంశాలు:
తెలంగాణ ఎన్నికలను గుణపాఠంగా తీసుకున్న సీఎం జగన్
ఆ స్థానాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు
మిగితా స్థానాల్లో సిట్టింగ్ లకు చాన్స్ దక్కినట్టేనా?
YSRCP : తెలంగాణలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకుండా అందరు సిట్టింగ్ లకే టికెట్లు ఇవ్వడం, ఇప్పటికే పోటీ చేసి ఓడిపోయినా కూడా వాళ్లకే టికెట్స్ ఇవ్వడం బీఆర్ఎస్ కు ఈసారి ఎన్నికల్లో పెద్ద మైనస్ అయింది. సిట్టింగ్ లకు టికెట్స్ ఇస్తే మేము ఖచ్చితంగా ఓడిస్తాం అని ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల ప్రజలు వార్నింగ్ ఇచ్చారు. చాలామంది ఎమ్మెల్యేల మీద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా కేసీఆర్ మాత్రం అస్సలు అవేవీ పట్టించుకోకుండా సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ ఇచ్చారు. కేవలం 9 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. ఆయన అభ్యర్థులను మార్చిన 9 స్థానాల్లో ఏడు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అంటే.. సిట్టింగ్ ల మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి తప్పే తాను కూడా చేయకూడదనుకొని తెలంగాణ ఎన్నికలను ఒక గుణపాఠంగా తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అందుకే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్నారు. అందులో భాగంగానే 82 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చబోతున్నారట. మంగళగిరి లాంటి నియోజకవర్గంలో ఆళ్ల లాంటి తన సన్నిహితుడికి కూడా టికెట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు జగన్. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
మరోసారి ఏపీలో వైసీపీ గెలవాలంటే.. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో, పార్టీలో భారీ ప్రక్షాళన తప్పదని సీఎం జగన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే మార్చుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస, పాతపత్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల అభ్యర్థులను మార్చబోతున్నారట. రాజాం, బొబ్బిలి, అనకాపల్లి, గాజువాక, వైజాగ్ సౌత్, పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అరకు, పాడేరు, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం, గన్నవరం, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, ఉండి, ఏలూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు, అవనిగడ్డ, పెడన, నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లే, వేమూరు, సంతనూతలపాటు, అద్దంకి, పర్చూరు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అభ్యర్థులను మార్చాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
YSRCP : రాయలసీమలో కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు
రాయలసీమలోనూ చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను సీఎం జగన్ మార్చబోతున్నారు. కర్నూలు జిల్లాలో కొడమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట, జమ్మలమడుగు, కమలాపురం, హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి, సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం లాంటి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.