YS Jagan Mohan Reddy : కష్టాల్లో వైసీసీ.. మరో బీఆర్ఎస్ కాబోతోందా? పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Mohan Reddy : కష్టాల్లో వైసీసీ.. మరో బీఆర్ఎస్ కాబోతోందా? పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు

 Authored By kranthi | The Telugu News | Updated on :15 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  ఆళ్ల గుడ్ బై చెప్పడంతో వైసీపీలో పెను మార్పులు

  •  60 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధం

  •  సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకపోతే వైసీపీ పార్టీ చిన్నాభిన్నం కానుందా?

YS Jagan Mohan Reddy : వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాలుగున్నరేళ్లు దాటింది. 2019 లో వైసీపీ పార్టీ గెలిచినప్పుడు పార్టీ చాలా బలంగా ఉంది. కానీ.. రాను రాను.. రోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీలో చీలికలు రావడం స్టార్ట్ అయింది. చాలామంది నేతల్లో గొడవ స్టార్ట్ అయింది. పార్టీ హైకమాండ్ మాటను ఎవ్వరూ వినడం లేదు. దీంతో వాళ్లలో వాళ్లకే గొడవ. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు అంటే దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు.. పార్టీకి రోజురోజుకూ తగ్గిపోతున్న బలం, ప్రజల్లో పార్టీపై వస్తున్న వ్యతిరేకత కావచ్చు.. ఇలా చాలా విషయాలు ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేలను వేధిస్తున్న సమస్య. మరోవైపు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇచ్చే చాన్సే లేదని జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాదాపు 80 మంది వరకు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ హుకుం జారీ చేశారు.

అందుకే.. జగన్ కు సన్నిహితుడు అయినప్పటికీ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. చివరకు పార్టీని కూడా వీడారు. ఈసారి మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని బరిలోకి దింపబోతున్నారు జగన్. ఇలా మంగళగిరి మాత్రమే కాదు.. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చేది లేదని ముందే తేల్చిచెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు ముందే తట్టా బుట్టా సర్దుకునే ప్లాన్ లో ఉన్నారట. మొత్తంగా 60 మంది ఎమ్మెల్యేలు అయితే చాన్స్ దొరికితే వైసీపీ నుంచి జంప్ అయి వేరే పార్టీలో చేరాలని అనుకుంటన్నారట. వేరే పార్టీ అంటే ఇప్పుడు అందరికీ కనిపించేది టీడీపీ మాత్రమే. టీడీపీకి కాస్త సన్నిహితంగా ఉండేవాళ్లు ఇప్పటికే టీడీపీ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్లారట. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తఱువాయి.. వెంటనే జంప్ అయిపోవాలని చూస్తున్నారట.

YS Jagan Mohan Reddy : జంపింగ్ జపాంగులు ఎందుకు పెరుగుతున్నట్టు?

వైసీపీలో జంపింగ్ జపాంగులు పెరిగిపోవడానికి కారణాలు ఏంటో అందరికీ తెలుసు. అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డే పార్టీని వీడిపోయాక ఇక తామెందుకు ఉండాలి అని మరికొందరు నేతలు అనుకుంటున్నారట. జగన్.. ఎమ్మెల్యేల కంటే కూడా సర్వేలనే నమ్ముతారని అందుకే టికెట్లు దక్కవని భావిస్తున్న ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది