Ysrcp fourth list : యెల్లో బ్యాచ్ ని వనికిస్తున్న వైఎస్ జగన్… నాలుగవ జాబితా విడుదల…!
ప్రధానాంశాలు:
Ysrcp fourth list : యెల్లో బ్యాచ్ ని వనికిస్తున్న వైఎస్ జగన్... నాలుగవ జాబితా విడుదల...!
Ysrcp fourth list : మొత్తానికి వైఎస్ఆర్సిపి పార్టీ తన నాలుగో జాబితా కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ జాబితాలో గమనించినట్లయితే ఒక ఎంపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేల సీట్లకు ఇన్చార్జిలను వైసీపీ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. అయితే ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేయడం జరిగింది.ఇక ఈ జాబితాను గమనించినట్లయితే దీనిలో చిత్తూరు ఎంపీ సీటుకు ఇన్చార్జిగా నారాయణస్వామిని ప్రకటించారు. అదేవిధంగా గంగాధర నెల్లూరుకు రెడ్డప్పను ప్రకటించడం జరిగింది..
అదేవిధంగా సింగనమలకు వీరాంజనేయుడు మరియు నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్ మరియు తిరువూరుకు నల్లగట్ల స్వామి దాస్ అలాగే మడకశిరకు ఈర లకప్ప కొవ్వూరుకు తలారి వెంకట్రావు అలాగే గోపాలపురం కి తానేటి వనిత అదేవిధంగా కనిగిరి కి దద్దాల నారాయణ యాదవులను ప్రకటించారు.అయితే ఇక్కడ గమనించినట్లయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా చేశారు. అదేవిధంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్పని మాత్రం తీసుకుని వచ్చి గంగాధర నెల్లూరుకి మార్చారు.
అదేవిధంగా హోంమంత్రి తానేటి వనిత సీటు ను కొవ్వూరు కి మార్చి ఆమె స్థానాన్ని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకి ఇచ్చారు. ఆయన సీటు గోపాలపురం నుంచి వనిత ను ఇన్చార్జిగా నియమించారు.విడుదలైన ఈ జాబితాలో మొత్తం మీద చూస్తే 8 అసెంబ్లీ సీట్లలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక చిత్తూరు ఎంపీ కాండిడేట్ గా ఉపముఖ్యమంత్రిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జాబితాలో ఒక జనరల్ సీట్ తో పాటు ఏడు ఎస్సీ అసెంబ్లీ సీట్లలో కీలకమైన మార్పులు జరిగాయని చెప్పాలి.