Central Government: కేంద్రం గుడ్‌న్యూస్ .. చిన్న వ్యాపారాల నుంచి హైటెక్ వరకు కొత్త అవకాశాల పండగ.. ఎలాగో తెలుసా? !
ప్రధానాంశాలు:
Central Government : కేంద్రం గుడ్‌న్యూస్ ..చిన్న వ్యాపారాల నుంచి హైటెక్ వరకు కొత్త అవకాశాల పండగ.. ఎలాగో తెలుసా? !
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ‘భారత్ మార్ట్’, ‘వర్చువల్ ట్రేడ్ కారిడార్’ వంటి ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, టెక్నాలజీ రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. దీని ప్రభావం నేరుగా మన ఊరి వ్యాపారి నుంచి అంతర్జాతీయ మార్కెట్ల వరకూ కనిపించనుంది.
Central Government : కేంద్రం గుడ్‌న్యూస్ .. చిన్న వ్యాపారాల నుంచి హైటెక్ వరకు కొత్త అవకాశాల పండగ.. ఎలాగో తెలుసా? !
Central Government: చిన్న వ్యాపారాలకు గ్లోబల్ మార్కెట్ గేట్లు ఓపెన్
ఇప్పటివరకు ఎగుమతులు అంటే పెద్ద కంపెనీలకే సాధ్యమనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ‘భారత్ మార్ట్’ మరియు ‘వర్చువల్ ట్రేడ్ కారిడార్’ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మన దేశంలోని చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను నేరుగా గల్ఫ్ దేశాలకు, ఆఫ్రికా మార్కెట్లకు విక్రయించవచ్చు. ఒక చిన్న బియ్యం మిల్లు ఓనర్ అయినా మసాలాలు తయారు చేసే వ్యాపారి అయినా హస్తకళల ఉత్పత్తులు అమ్మే కుటుంబ వ్యాపారమైనా అందరికీ అంతర్జాతీయ మార్కెట్ చేరువవుతుంది. 2032 నాటికి భారత్–UAE మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్స్ రూపొందించబడ్డాయి. రవాణా, లాజిస్టిక్స్ సమస్యలు పెద్ద అడ్డంకిగా ఉండేవి. కానీ ఇప్పుడు అదానీ, టాటా వంటి దిగ్గజ సంస్థలు పోర్టులు గోదాములు, షిప్పింగ్ వ్యవస్థలను చూసుకుంటాయి. దీని వల్ల చిన్న వ్యాపారి ఉత్పత్తి నాణ్యతపై దృష్టి పెట్టినా సరిపోతుంది. మన సరుకులకు గల్ఫ్ దేశాల్లో గిరాకీ పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపిరి వస్తుంది.
Central Government: ధోలేరా నుంచి ఎనర్జీ వరకు: ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో భారీ పెట్టుబడులు
గుజరాత్‌లోని ధోలేరా స్మార్ట్ సిటీలో ఎయిర్‌పోర్ట్, పోర్ట్, విద్యుత్ ప్రాజెక్టుల కోసం UAE భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీని వల్ల భారత్ కేవలం తయారీ కేంద్రంగా కాకుండా ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా మారే అవకాశముంది. ఉత్పత్తి నుంచి రవాణా వరకూ పూర్తి విలువ శ్రేణిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అదానీ గ్రూప్, టాటా ఎలక్ట్రానిక్స్ టోరెంట్ పవర్ వంటి కంపెనీలకు ఇది నిజమైన జాక్‌పాట్‌లా మారింది. మరోవైపు HPCL సంస్థ UAEకి చెందిన గ్యాస్ కంపెనీతో 10 ఏళ్ల పాటు గ్యాస్ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రధాన లాభం ఏమిటంటే వచ్చే పదేళ్ల పాటు గ్యాస్ ధరలు కరెంట్ ఖర్చులు స్థిరంగా ఉండే అవకాశం. ఇది పరిశ్రమలకు మాత్రమే కాదు సామాన్య ప్రజలకు కూడా పెద్ద ఊరట. అంతేకాదు చిన్న పరిమాణం గల అణు రియాక్టర్ల (SMRs) టెక్నాలజీలో కూడా ఇరు దేశాలు కలిసి పని చేయనున్నాయి. ఇది భవిష్యత్‌లో శుభ్రమైన చౌకైన ఎనర్జీకి దారి తీస్తుంది…
Central Government:స్పేస్, AI, డిఫెన్స్: భారత్ కొత్త శక్తి కేంద్రం
టెక్నాలజీ రంగంలో ఈ భాగస్వామ్యం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇస్రో అనుబంధ సంస్థ IN-SPACeతో కలిసి రాకెట్ లాంచింగ్ స్పేస్ పరికరాల తయారీలో UAE భాగస్వామిగా చేరనుంది. దీని వల్ల భారత్ స్పేస్ ఎకానమీ మరింత బలోపేతం అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక సూపర్ కంప్యూటర్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మన టెక్ స్టార్టప్‌లకు రాకెట్ ఇంధనం లాంటిది. హెల్త్‌కేర్, ఫైనాన్స్, అగ్రికల్చర్ నుంచి డిఫెన్స్ వరకూ AI ఆధారిత పరిష్కారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. డిఫెన్స్ రంగంలోనూ పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా ఉన్న భారత్ ఇకపై UAEతో కలిసి ఆయుధాలు రక్షణ సాంకేతికతను తయారు చేయనుంది. L&T, BEL వంటి భారతీయ కంపెనీలకు మిడిల్ ఈస్ట్ మార్కెట్లు తలుపులు తెరిచినట్టే. అంతిమంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను సులభతరం చేయడం వల్ల మన రైతులు పండించే బియ్యం, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తులు ఎలాంటి అడ్డంకులు లేకుండా UAEకి ఎగుమతి అవుతాయి. ఇది రైతుల ఆదాయం పెరగడానికి మరో బలమైన మార్గం. ఈ భారత్–UAE భాగస్వామ్యం చిన్న వ్యాపారి నుంచి హైటెక్ స్టార్టప్ వరకు అందరికీ కొత్త భవిష్యత్తును చూపిస్తోంది.