Business Idea : తన కూతురు కోసం స్ట్రాబెర్రీ జామ్ తయారు చేస్తే.. అది అందరికీ నచ్చింది.. ఆ ఐడియానే ఇప్పుడు తనకు ఉపాధి అయింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : తన కూతురు కోసం స్ట్రాబెర్రీ జామ్ తయారు చేస్తే.. అది అందరికీ నచ్చింది.. ఆ ఐడియానే ఇప్పుడు తనకు ఉపాధి అయింది

 Authored By jyothi | The Telugu News | Updated on :15 February 2022,8:20 am

Business Idea : తన పాప కోసం చేసిన జామ్.. ఆమెకు వ్యాపారంగా మారింది. అమ్మమ్మ నేర్పిన వంట ఉపాధిగా మారింది ఆమెకు. ‘యమ్ యమ్మీ’ పేరుతో జామ్ అమ్మకాలు ప్రారంభించి విజయపథంలో సాగుతున్న హరియామా కురుక్షేత్రానికి చెందిన  బ్యాంకర్ తల్లి ‘సౌమీ దే’ పై ప్రత్యేక కథనం.’మా అమ్మమ ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండేది. మా అమ్మమ్మ వాటితో టేస్టీ.. జామ్ తయారు చేసేది. వాటిని మేము లొట్టలేసుకుని తినేవాళ్లం. నా కూతురికి జామ్‌ అంటే చాలా ఇష్టం. బయట జామ్ లు తినగానే తన ఆరోగ్యం పాడయ్యేది. తనకి ప్రిజర్వేటీవ్ లు, కృత్రిమ రంగుల వల్ల అలర్జీ ఉందని మాకు అర్థమైంది. నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. వెంటనే ఇంటర్నెట్ లో చూసి కొన్ని జామ్ రెసిపీస్ నేర్చుకున్నా. ముందుగా స్ట్రాబెరీ జామ్ చేశాను. నా కూతురికి అది చాలా నచ్చింది. అలా నా జామ్ వ్యాపారం మొదలైంది’ -సౌమీ దేఇలా చేసిన జామ్ ను సౌమీ తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు రుచి చూపించింది..

అది వాళ్లకు చాలా నచ్చి.. వ్యాపారంగా చేయమని ఐడియా ఇచ్చారు. 2015 జనవరిలో, సౌమి ‘యమ్మియం’ అనే పేరుతో కంపెనీ పెట్టి.. జామ్ లు అమ్మడం ప్రారంభించింది.ప్రస్తుతం, ఆమె ఎనిమిది రకాల జామ్‌లను విక్రయిస్తోంది. ఆరు రకాల ఊరగాయలను కూడా పరిచయం చేసింది. ఇప్పటి వరకు, సౌమీ 10 వేలకు పై బాటిళ్లను విక్రయించారు. ‘జామ్‌ల తయారీలో  శుభ్రపరచడం, ముక్కలు కోయడం లాంటి పనులు చాలా ఉంటాయి. మేము రాత్రిపూట చక్కెరలో పండ్లను నానబెడతాము. మరుసటి రోజు,  30 నుంచి 45 నిమిషాలు ఉడికించాలి. ఎటువంటి కృత్రిమ రుచులు, గుజ్జు లేదా రంగుల  ఉపయోగించం.”అని సౌమీ వివరించారు. ‘నాకు వ్యాపారం చేయడంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండి లేదు.

a mother from haryana set up business by making jam to her daughter

a mother from haryana set up business by making jam to her daughter

ఇది మాకు ఒక పెద్ద సవాలు, ఇక్కడ మేము మొదట్నుంచీ ప్రతిదీ నేర్చుకోవాలి. నాణ్యత పారామితుల కోసం మా ఉత్పత్తులను పరీక్షించడానికి యంత్రాలను గుర్తించడం నుండి ప్యాకేజింగ్ వరకు, ప్రతిదీ మాకు సవాలు. యమ్మియం అన్ని ఉత్పత్తులను ఎఫ్ఐసీసీఐ ఆమోదించింది.జార్ లేబుల్‌లలో పేర్కొన్న షెల్ఫ్ లైఫ్ కు పరీక్షించబడ్డాయి.’ – సౌమీ’మీరు మంచి పని చేస్తున్నారన్న అనుభూతి మీకు ఉన్నంత కాలం మీరు విజయం సాధిస్తారు. బయటకు వెళ్లి, వ్యక్తులను కలవండి, వారికి ఏమి కావాలి, మీ సర్వీస్ ఎలా మెరుగుపరచు కోవచ్చు. అని వారిని అడగండి. వ్యాపారం చేయడం అనేది సవాళ్లతో కూడిన పని.. కానీ చివరికి, ఇది విలువైనదే’- సౌమీ ఇచ్చే సలహా

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది