Business Ideas : పది వేల పెట్టుబడితో పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేసి నేడు లక్షలు సంపాదిస్తున్న మహిళ

Business Ideas : కొందరి సక్సెస్ స్టోరీస్ వింటే ఆశ్చర్యంతో పాటు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అప్పటి వరకు మూసగా సాగిన జీవితాన్ని వారు ఎలా విజయవంతంగా మల్చుకున్నారో తెలుసుకుంటుంటే చిత్రంగా అనిపిస్తుంది. అలాంటి విజయగాథనే అస్సాంకు చెందిన దీపాలి భట్టాచార్యది. ఒక సాధారణ గృహిణిగా ఉండే తను… వ్యాపారవేత్తగా మారిన తీరు నిజంగా అసాధారణం. ప్రకృతి అనే పచ్చళ్లు, స్నాక్స్ బిజినెస్ ను స్టార్ట్ చేసి విజయవంతంగా నడిపిస్తోంది. 25 రకాల పచ్చళ్లు మరియు స్నాక్స్ లు దేశవ్యాప్తంగా అమ్ముతోంది. సాంప్రదాయ పచ్చళ్లకు తనదైన శైలి రుచిని జత చేస్తూ విక్రయిస్తోంది దీపాలి భట్టాచార్య. సంవత్సరానికి దాదాపు 5 లక్షల వరకు సంపాదిస్తోంది.2003లో దీపాలి భట్టాచార్య భర్త గుండెపోటుతో మరణించాడు.

అతను అసోం జాతీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా చేసేవాడు. మొదటి నుండి దీపాలి భట్టాచార్య వంట చేయడంలో మంచి ప్రావీణ్యం కనబరిచేది. భర్త మరణం తర్వాత ఇంటిని నడపడానికి, తన అత్తను, తన కూతురిని పోషించడానికి ఉపాధి మార్గాలు అన్వేషించడం మొదలుపెట్టింది. వంట పోటీలు జరిగే ప్రతి చోట దీపాలి పాల్గొంటూ బహుమతులు గెలుచుకునేంది దానినే.. వ్యాపారంగా మలుచుకోవాలన్న ఆలోచన రావడంతో.. 2015లో ప్రకృతిని ప్రారంభించింది.కేవలం రూ. 10 వేల రూపాయలతో ప్రకృతిని మొదలు పెట్టింది. చేతితో తయారు చేసిన పచ్చళ్లను అమ్మడం  ప్రారంభించింది. తన కుటుంబానికి ఒకప్పుడు ఉన్న మసాలా బిజినెస్ ద్వారా.. మసాలా దినుసుల గురించి చాలా నేర్చుకుంది దీపాలి. దీపాలి పాకశాస్త్ర నైపుణ్యంతో మంచి రుచికరమైన పచ్చళ్లను వినియోగదారులకు అందివ్వడంతో వారి సంఖ్య క్రమంగా పెరిగింది. కొబ్బరి ఉత్పత్తులను తయారు చేయడం ప్రావీణ్యం సంపాదించిన దీపాలి భట్టాచార్య…

assam woman entrepreneur small biz pickle homemade homemaker business at home

ప్రస్తుతం చాలా మంది కోరుకునే పసుపు-కొబ్బరి ఊరగాయకు ప్రాణం పోసింది.ఆమె ఇంటి కిచెన్ నుండి రుచికరమైన ఊరగాయలు ప్రకృతి కోసం తన ఇంట్లో వంటగది అన్ని కార్యకలాపాలకు కేంద్రమని దీపాలి చెప్పింది. ఆమె తయారు చేసే ఏ పచ్చడికి కూడా ఒకే రకమైన రుచి ఉండదు. ఎందుకంటే వాటి రుచిని ఎప్పుడూ మెరుగుపరచడానికే దీపాలి ప్రాధాన్యం ఇస్తుంటుంది. ప్రకృతి కస్టమర్లు టోస్ట్ పితా సహా చికెన్, ఫిష్ ఊరగాయలతో పాటు పసుప-కొబ్బరికాయ పచ్చళ్లను ఎక్కువగా కొంటారు. ఈ ఊరగాయల గొప్పదనం ఏమిటంటే అవి ఇంట్లో తయారుచేసిన వాటిలాగే రుచిగా ఉంటాయని అంటారు వినియోగదారులు. దుకాణాల్లో కొనుగోలు చేసిన ఊరగాయల్లో నూనె ఎక్కువగా మరియు కారంగా ఉంటాయని.. కానీ ప్రకృతి ఊరగాయల్లో అవేవి  ఉండవి చెబుతారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago