Ayushman Card : ఆయుష్మాన్ హెల్త్ కార్డ్..70 ఏళ్ల వారికి రూ. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్..!
ప్రధానాంశాలు:
Ayushman Card : ఆయుష్మాన్ హెల్త్ కార్డ్..70 ఏళ్ల వారికి రూ. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్..!
Ayushman Card : 70ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం Ayushman Bharat కింద హెల్త్ కార్డులను అందిస్తోంది. ఆరోగ్య బీమా ద్వారా సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ. 5 లక్షల విలువైన ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఆయుష్మాన్ వే వందన కార్డును పొంది దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా దేశమంతటా ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.

Ayushman Card : ఆయుష్మాన్ హెల్త్ కార్డ్..70 ఏళ్ల వారికి రూ. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్..!
Ayushman Card : ఆలస్యం చేయకండి..
2018లో పీఎం నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. 55 కోట్లకు పైగా ప్రజలలో దాదాపు 40 శాతం కవర్ చేస్తుంది. అక్టోబర్ 29, 2024 నుంచి ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ ఈ పథకానికి అర్హులే. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే వ్యాలీడ్ ఆధార్ కార్డు ఉండాలి మీరు రెండు సులభమైన మార్గాల ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి మొబైల్ యాప్ ద్వారా రెండోది అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆయుష్మాన్ భారత్ ayushman bharat scheme వెబ్‌సైట్‌ను మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా చేయవచ్చు. ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి.‘సీనియర్ సిటిజన్ల రిజిస్టర్ (70+)’ బ్యానర్‌పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి .బయోమెట్రిక్స్ ద్వారా e-KYC పూర్తి చేయండి. మీ వివరాలను సమర్పించి Agree ఆప్షన్ క్లిక్ చేయండి.లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేయండి. ఫారమ్‌ను సమర్పించండి. కార్డ్ 15నుంచి 20 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి. ముందుగానే అప్లయ్ చేయడం ద్వారా కవరేజీని పొందడానికి వీలుంటుంది.