Gold and Silver Rates 24th Feb 2026 : మహిళలకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. భగ్గుమన్న బంగారం.. రూ.3 లక్షలు దాటిన వెండి.. మంగళవారం లేటెస్ట్ రేట్లు ఇవే!

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 February 2026,9:49 am

Gold and Silver Rates 24th Feb 2026 బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న సామాన్యులకు, పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు మరోసారి తీవ్ర నిరాశను మిగిల్చాయి. వారం క్రితం కాస్త శాంతించినట్లు కనిపించిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. “నేనేమైనా తక్కువా?” అన్నట్లు వెండి ధర కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. మంగళవారం ఫిబ్రవరి 24 నాటికి దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారంపై రూ.2 వేలకు పైగా పెరగ్గా, కిలో వెండి ఏకంగా మళ్లీ రూ.3 లక్షల మార్క్‌ను దాటేసింది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ ఈ రేంజ్‌లో ధరలు పెరగడం సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Gold and Silver Rates 24th Feb 2026 : మహిళలకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. భగ్గుమన్న బంగారం.. రూ.3 లక్షలు దాటిన వెండి.. మంగళవారం లేటెస్ట్ రేట్లు ఇవే!

Gold and Silver Rates 24th Feb 2026 : మహిళలకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. భగ్గుమన్న బంగారం.. రూ.3 లక్షలు దాటిన వెండి.. మంగళవారం లేటెస్ట్ రేట్లు ఇవే!

Gold and Silver Rates 24th Feb 2026 పసిడి, వెండి ధరలు పెరగడానికి కారణాలు ఇవే!

బంగారం, వెండి ధరలు ఇంతలా ఆకాశాన్ని తాకడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్‌పై ఏ క్షణమైనా అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. దీంతో వారంతా సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ఇటీవల ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకోవడానికి భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ డిమాండ్ వల్లే ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.

Gold and Silver Rates 24th Feb 2026 గ్లోబల్, MCX మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 57.98 డాలర్లు పెరిగి, ప్రస్తుతం 5,165 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.88 శాతం పెరిగి 86.28 డాలర్లకు చేరుకుంది. దేశీయ మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్ MCXలో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1.60 లక్షల వద్ద, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రేటు రూ.2.66 లక్షల వద్ద ట్రేడవుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు ఫిబ్రవరి 24 బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత ఐదు రోజుల్లోనే గ్రాముపై సుమారు రూ.700 వరకు పెరగడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం నిన్నటిపై రూ.2,070 మేర పెరిగి, ప్రస్తుతం 10 గ్రాముల (తులం) స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,61,360 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,900 పెరిగి రూ.1,47,910 కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,21,010 వద్ద నమోదైంది.

కిలో వెండి రూ.3 లక్షలు దాటేసింది

బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం కళ్లు చెదిరేలా పెరుగుతోంది. గడిచిన ఐదు రోజుల్లోనే ఏకంగా కిలో వెండిపై రూ.40 వేలకు పైగా పెరిగింది. నిన్న రూ.20 వేలు పెరగ్గా, నేడు మరో రూ.10 వేలు పైకి ఎగబాకింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,00,100 వద్ద కొనసాగుతోంది.

(గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం పూట నమోదైనవి. స్థానిక పన్నులు, జీఎస్టీ, తయారీ ఛార్జీల ఆధారంగా జ్యువెలరీ షాపుల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.)

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి