Business Idea అందరూ జీవితంలో స్థిరపడాలని ఆశ పడతారు. మంచి ఉద్యోగం, సొంతిళ్లు, కారు ఇలాంటివి వారి లైఫ్ లో ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా కొంత మంది మాత్రమే తమ కలల వైపు నడుస్తారు. సమజానికి ఏదైన చేయాలన్న కోరికకు ప్రాణం పోసి.. తమ వంతు సాయం చేస్తుంటారు. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతీక్ష, ప్రతీక శర్మ దంపతులు రెండో కోవకు చెందిన వ్యక్తులు. సమాజానికి ఏదైనా చేయాలన్న కోరిక.. వారిని బ్యాంకింగ్ ఉద్యోగాలు మాన్పించింది. ఒక స్టార్టప్ పెట్టి దాని ద్వారా రైతులకు సాయం అందించడంతో పాటు.. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తోంది. అవి కూడా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలు కావడం. ఒక విశేషం అయితే… ఈ ప్రక్రియలో రైతులకు అధిక లాభాలు రావడం రెండో ప్రయోజనం. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతీక్ష మరియు ప్రతీక్ శర్మ.. ‘గ్రీస్ అండ్ గ్రెయిన్స్’ అనేది ఫామ్ టు ఫోర్క్ వ్యాపార నమూనాను ప్రారంభించారు. రైతులతో పూర్తి సేంద్రీయ పద్ధతిలో ఎలాంటి రసాయనాలు, పెస్టిసైడ్స్ వాడకుండా పంటలు పండించి వాటిని సరైన పద్ధతుల్లో శుభ్రపరిచి, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి వినియోగదారుల ఇళ్లకే వెళ్లి. అందిస్తారు. ఈ విధానంలో రైతులకు ఎక్కువ లాభాలు రావడంతో పాటు.. వినియోగదారులకు పూర్తి సేంద్రీయ కూరగాయలు లభిస్తుంటాయి.
కానీ,, ఇది అంత సులభంగా ఏం మొదలు కాలేదు. మొదట్లో ఎన్నో డక్కా మొక్కీలు తిన్నారు. చేతిలో ఉన్న సేవింగ్స్ అన్నీ కోల్పోయారు. ఎన్నో నష్టాలు చవిచూశారు. కానీ వాటిని వాళ్లు నష్టాలుగా కాకుండా ఒక ప్రయోజనంగానే పరిగణించారు. ప్రారంభంలో ఎదురైన ఈ సవాళ్లు… దేశంలో ఒక రైతుకు ఎదురవుతున్న సమస్యలు అని వారు గుర్తించారు. రోజులు గడుస్తున్న కొద్దీ.. వారి సమస్యలకు పరిష్కారం కనుక్కుంటూ ముందుకు సాగారు. నష్టాలను పూర్తిగా జీరోకు తీసుకువచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలోని ఉత్తమ సేంద్రీయ రైతులను కలవడం వారి సాగు పద్ధతులు, వారి ఆలోచనా విధానం ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు. ఎంతో నేర్చుకున్నారు. వ్యవసాయం వెనక ఉన్న శాస్త్రీయతను తెలుసుకున్నారు. వారు చేసిన కృషికి, అధ్యయనానికి మల్లగా ఫలితం రావడం మొదలైంది. దేశంలో రైతులంతా ఎదుర్కొనే అతి పెద్ద సమస్య వారి ఉత్పత్తులకు సరైనా మార్కెటింగ్ కల్పించుకోవడం. ఎన్నో కష్టాలు పడి ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. దానికి సరైన ధర రాక చాలా మంది రైతులు నష్టపోతారు. అందుకే ప్రతీక. ప్రతీక్ష దంపతులు నుండిలపై ఆధారపడకూడదని సంకల్పం తీసుకున్నారు. అదే వారిని ఫామిటు ఫోర్క్ వ్యవస్థను నిర్మించడానికిప్రోత్సహించినట్లు అయింది.
మొదట్లో తన 5.5 ఎకరాల్లో సేంద్రీయ పద్ధతుల్లో పంట పండించి.. ఆ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ద్వారా మొదలైంది గ్రీన్ అండ్ గ్రెయిన్స్ ప్రస్థానం. గ్రీన్ అండ్ గ్రెయిన్స్ బిజినెస్ మోడల్ IIM ప్రొఫెసర్లనూ ఆకర్శించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్టార్ట్-అప్ ఇండియా ప్రోగ్రామ్ మరియు స్టార్ట్-అప్ ప్రోగ్రామ్ కింద గ్రీన్ అండ్ గ్రెయిన్స్ రిజిస్టర్డ్ స్టార్టప్ అయింది. మార్చి 2020లో కరోనా రావడం ప్రతీక్, ప్రతీక్షకు చాలా ప్లస్ అయింది. గ్రీన్ అండ్ గ్రెయిన్స్ పూర్తిగా నష్టాల్లో ఉన్నప్పుడు కరోనా రావడం, లాక్ డౌన్ విధించడం, ప్రతి ఒక్కరికి ఆరోగ్య స్పృహ పెరిగిపోవడం వీరికి చాలా కలిసొచ్చింది. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కానీ మంచి ఆహారం తినాలని ప్రతి ఒక్కరూ భావించడం మొదలుపెట్టారు. దీంతో గ్రీన్ అండ్ గ్రెయిన్స్ కు మంచి ఆర్డర్లు పెద్ద సంఖ్యలో రావడం మొదలు పెట్టాయి. సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. మొదటిసారి గ్రీన్ అండ్ గ్రెయిన్స్ లాభాలు ఆర్జించడం మొదలు పెట్టింది. గతేడాది రూ. 60 లక్షల ఆదాయం సమకూరింది. ఇప్పుడు గ్రీన్ అండ్ గ్రెయిన్స్ తమ వినియోగదారులకు హోమ్ డెలివరీల ద్వారా 250 కంటే ఎక్కువ ఉత్పత్తులను అందిస్తున్నారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.