Business Idea: తక్కువ పెట్టుబడితో హై ప్రాఫిట్స్..ప్రతి నెలా రూ.80 వేలు సంపాదించే ట్రెండీ బిజినెస్‌ ఇదే..!

Business Idea: తక్కువ పెట్టుబడితో హై ప్రాఫిట్స్..ప్రతి నెలా రూ.80 వేలు సంపాదించే ట్రెండీ బిజినెస్‌ ఇదే..!

 Authored By suma | The Telugu News | Updated on :26 January 2026,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Business Idea: తక్కువ పెట్టుబడితో హై ప్రాఫిట్స్..ప్రతి నెలా రూ.80 వేలు సంపాదించే ట్రెండీ బిజినెస్‌ ఇదే..!

Business Idea: తక్కువ పెట్టుబడితో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం ఒక ట్రెండీ ఐడియా బాగా పాపులర్ అవుతోంది. అదే సెల్ఫీ కాఫీ బిజినెస్. కాఫీ, డ్రింక్స్, కేక్‌లపై మనకు నచ్చిన ఫోటోలను ముద్రించి కస్టమర్లకు అందించడం ఈ వ్యాపార ప్రత్యేకత. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో యూనిక్ కాన్సెప్ట్స్‌కు డిమాండ్ పెరుగుతున్న ఈ రోజుల్లో సెల్ఫీ కాఫీ బిజినెస్ మంచి ఆదాయ మార్గంగా మారుతోంది.

This is the most profitable business

Business Idea: తక్కువ పెట్టుబడితో హై ప్రాఫిట్స్..ప్రతి నెలా రూ.80 వేలు సంపాదించే ట్రెండీ బిజినెస్‌ ఇదే..!

Business Idea: సెల్ఫీ కాఫీ బిజినెస్ అంటే ఏమిటి?

సాధారణంగా కాఫీపై ఉండే నురుగుపై (ఫోమ్) వ్యక్తిగత ఫోటోలు, డిజైన్లు లేదా మెసేజ్‌లను ముద్రించడం ద్వారా ఈ ప్రత్యేక కాఫీని తయారు చేస్తారు. ఇందుకోసం ఫుడ్ గ్రేడ్ ఎడిబుల్ ఇంక్‌తో పనిచేసే 3D కాఫీ ప్రింటర్‌ను ఉపయోగిస్తారు. ప్రింట్ అయిన కాఫీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా తాగడానికి కూడా పూర్తిగా సురక్షితం. ఈ ఫోటో ప్రింటింగ్ టెక్నాలజీ కాఫీతోనే పరిమితం కాదు. లస్సీ, మిల్క్ షేక్, థిక్ షేక్, ఫ్రూట్ జ్యూస్‌లు, అలాగే కేక్‌లపై కూడా ఫోటోలను ముద్రించవచ్చు. అందుకే పిల్లలు, కపుల్స్, బర్త్‌డే సర్‌ప్రైజ్‌లు, ప్రపోజల్స్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది.

Business Idea: పెట్టుబడి ఎంత?.. అవసరమైన పరికరాలు ఏవి?

ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రధానంగా మినీ కాఫీ ప్రింటర్ మెషిన్ అవసరం. దీని ధర సుమారు రూ.1.20 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఫుడ్ ప్రింటర్‌తో పాటు ఫుడ్ గ్రేడ్ ఎడిబుల్ ఇంక్ కూడా వస్తుంది. అదనంగా ఫిల్టర్ కాఫీ మెషిన్ కొనాలి దీని ఖర్చు సుమారు రూ.20 వేలు. లస్సీ, షేక్‌లు తయారు చేయడానికి మిక్సర్ గ్రైండర్, బ్లెండర్ వంటి సాధారణ పరికరాలు అవసరం. వ్యాపారం మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే చిన్న కాఫీ షాప్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. మంచి సిట్టింగ్ ఉన్న ప్రదేశంలో అద్దెకు షాప్ తీసుకుంటే కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుంది.

Business Idea: ఆదాయం..లాభాలు ఎంత వరకు వస్తాయి?

ఒక సెల్ఫీ కాఫీకి రూ.100 నుంచి రూ.150 వరకు ధర నిర్ణయించవచ్చు. రోజుకు కనీసం 50 కాఫీలు అమ్మగలిగితే దాదాపు రూ.5,000 వరకు డైలీ టర్నోవర్ వచ్చే అవకాశం ఉంది. నెలకు అద్దె, సిబ్బంది జీతాలు, ఎడిబుల్ ఇంక్ రీఫిల్స్ వంటి ఖర్చులకు సుమారు రూ.50 వేలు ఖర్చయినా, నెల చివరికి రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు నికర ఆదాయం పొందవచ్చు. ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతున్న ఈ సెల్ఫీ కాఫీ బిజినెస్‌ను మీ ఏరియాలో తొందరగా ప్రారంభిస్తే పోటీ తక్కువగా ఉండి మంచి లాభాలు అందుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో క్రియేటివ్ బిజినెస్ చేయాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది