Business idea : ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కొవిడ్ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విధించిన లాక్ డౌన్ తెచ్చిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ వైరస్ ప్రభావం చాలా దేశాలపై తీవ్రంగా ఉంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. పేద దేశాల నుండి అగ్ర రాజ్యాల వరకు కరోనాతో విలవిల్లాడాయి. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గినా.. అది చూపించిన ప్రభావం మాత్రం ఇంకా తొలగిపోలేదు.ఈ సంక్షోభంలో చాలా రంగాలను తీవ్ర నష్టాలకు గురి చేసింది. లాక్ డౌన్ సమయంలో పలు కంపెనీలు, సంస్థలు మూత పడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి… జీవితం గడవక ఎన్నో ఇబ్బందులు పడటం కళ్లారా చూశాం. అయితే.. కరోనా పలు రంగాలకు ఎంతో మేలు కూడా చేసింది. ఎన్నడూ లేనంత లాభాలు సాధించాయి. ఉన్నట్టుండి బిజినెస్ అమాంతం పెరిగి పోయింది. అయితే కరోనా సంక్షోభంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడగా.
మరికొందరు మాత్రం చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి… మంచి లాభాలు సంపాదించారు.అచ్చంగా ఇలాంటి పరిస్థితి వారణాసికి చెందిన రమేష్‌కు వచ్చింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం పోతుందన్న భయమే.. ఇప్పుడు ఆయనను లాభాల బాట పట్టించే సాగు వైపు తీసుకెళ్లింది. ఇప్పుడు లక్షలకొద్దీ సంపాదిస్తున్నాడు.ఒక ప్రైవేటు పాఠశాలలో రిసోర్స్ మేనేజర్‌గా పని చేసే రమేష్.. కరోనా లాక్‌డౌన్ సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయి పరిస్తితుల్లోకి నెట్టి వేయబడ్డాడు. ఉన్న ఉపాధి మార్గం పోతే ఎలా భావించిన రమేష్… మరో ఆదాయ మార్గం గురించి వెతకడం ప్రారంభించాడు. అదే సమయంలో తన స్నేహితునితో కలిసి రెండెకరాల భూమిలో సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను సాగు చేయాలని భావించాడు. కానీ వారికి ఎలాంటి అనుభవం లేదు. అయినా ముందుకే అడుగు వేశారు. ఇంటర్‌నెట్‌లో శోధించారు. వర్క్‌షాపులకు అటెండ్ అయ్యారు. స్ట్రాబెర్రీలను పండిస్తున్న ఎందరో రైతులను కలిసి సాగు మెలకువలను నేర్చుకున్నారు.
స్ట్రాబెర్రీలు పండటానికి చల్లని వాతావరణం కావాలని.. వారణాసిలో అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం ఉంటుందని గుర్తించారు. కొత్త కొత్త పద్దతులను అవలంభిస్తూ సాగు చేపట్టారు. డిప్ ఇరిగేషన్‌తో పాటు నీటి సంరక్షణ పద్ధతులు పాటించారు. క్రమంగా వారి కష్టానికి ఫలితం రావడం మొదలైంది. అది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు ఒక మొక్క నుంచి సగటున 500 గ్రాముల పండ్లు దిగుబడి వస్తోంది. రెండెకరాల పొలంలో 15 వేల మొక్కలు పెంచుతున్నారు. ఒక కిలో స్ట్రాబెర్రీ సగటున రూ. 200కి అమ్ముడవుతోంది. ప్రస్తుతం, రమేష్ అతని స్నేహితుడు మదన్ మొదటి పంట చివరి దశలో ఉన్నారు. పంట చేతికొచ్చి అమ్ముడు పోతే వారికి దాదాపు రూ. 5 లక్షల కంటే ఎక్కువే ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అంటే వారి నెలవారీ ఆదాయం లక్షకు పైగానే ఉంటుంది.రమేష్, మదన్ ఇద్దరు కలిసి వారి పొదుపు నుంచి దాదాపు రూ. 9 లక్షలు రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వారు పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.